ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: ‘చాయ్’ అమ్ముతున్న మంత్రి అంబటి రాంబాబు..!

ABN, Publish Date - Feb 28 , 2024 | 11:59 AM

పల్నాడు, ఫిబ్రవరి 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు(AP Elections 2024) దగ్గర పడుతుండటంతో రాజకీయ నాయకులు తమలోని నట సార్వభౌములను నిద్రలేపుతున్నారు. ముఖ్యంగా వైసీపీ(YSRCP) నాయకులు ప్రజల వద్దకు వెళ్లి చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) టీ మాస్టర్‌గా దర్శనమిచ్చారు. సెంటర్‌ చూసి.. టీకొట్టులో టీ తయారు చేశారు. అంతేకాదు..

Minister Ambati Rambabu

పల్నాడు, ఫిబ్రవరి 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు(AP Elections 2024) దగ్గర పడుతుండటంతో రాజకీయ నాయకులు తమలోని నట సార్వభౌములను నిద్రలేపుతున్నారు. ముఖ్యంగా వైసీపీ(YSRCP) నాయకులు ప్రజల వద్దకు వెళ్లి చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) టీ మాస్టర్‌గా దర్శనమిచ్చారు. సెంటర్‌ చూసి.. టీకొట్టులో టీ తయారు చేశారు. అంతేకాదు.. తాను తాగి.. తన అనుచరులకు కూడా టీ పోశారు. మంత్రిగారిలో ఈ యాంగిల్ కూడా ఉందా? అంటూ ఆయనగారి కళాపోషణకు అవాక్కవుతున్నారు వైసీపీ శ్రేణులు.

గత రెండు రోజులుగా ప్రజల్లోకి వెళ్తున్న మంత్రి అంబటి రాంబాబు.. బుధవారం నాడు సత్తెనపల్లిలో టీ మాస్టర్ అవతారం ఎత్తారు. సత్తెనపల్లిలోని ఐదు లాంతర్ల సెంటర్‌లోని ఓ టీస్టాల్ వద్దకు వచ్చిన ఆయన.. అక్కడ ప్రజలతో కాసేపు మాట్లాడారు. అదే సమయంలో తాను టీ మాస్టర్‌గా మారారు. స్వయంగా టీ తయారు చేసి తాగారు మంత్రి. తన అనుచరులకు కూడా టీ పోశారు. టీ స్టాల్ వద్దకు వచ్చిన వారితో మాట్లాడుతూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే, మంత్రి అంబటి రాంబాబు స్థానికులతో మమేకం అవడాన్ని ప్రజానీకం ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఓట్ల కోసం మంత్రి వర్యులు పడుతున్న తిప్పలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 28 , 2024 | 11:59 AM

Advertising
Advertising