ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: దుష్ట శక్తుల కుట్రలను తిప్పికొడతాం: మంత్రి బొత్స

ABN, Publish Date - Jan 25 , 2024 | 08:29 PM

దుష్ట శక్తుల కుట్రలను తిప్పి కొడతామని మంత్రి బొత్స సత్యనారాయణ ( Minister Botsa Satyanarayana) హెచ్చరించారు. భీమిలి‌ సంగీవలసలో ఈనెల 27వ తేదీన జరుగబోయే బహిరంగ సభ ఏర్పాట్లను గురువారం నాడు వైసీపీ నేతలు పరిశీలించారు.

విశాఖపట్నం: దుష్ట శక్తుల కుట్రలను తిప్పి కొడతామని మంత్రి బొత్స సత్యనారాయణ ( Minister Botsa Satyanarayana) హెచ్చరించారు. భీమిలి‌ సంగీవలసలో ఈనెల 27వ తేదీన జరుగబోయే బహిరంగ సభ ఏర్పాట్లను గురువారం నాడు వైసీపీ నేతలు పరిశీలించారు. ఈ ఏర్పాట్లను ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు చేసిన మంచిని సీఎం జగన్ ఈ సభలో వివరిస్తారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎలా పోరాటం చేయాలో సీఎం జగన్ సూచిస్తారని చెప్పారు. ప్రజలు వైసీపీ పాలనపై ప్రజలు సంతృప్తి పడితేనే తనకు ఓటు వేయాలని జగన్ దైర్యంగా చెబుతున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబులా మాయ మాటలు చెప్పడం సీఎం జగన్‌కు తెలియదన్నారు. ఏపీలో ఓటు హక్కు లేని వారు కూడా జగన్‌ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరిగింది అంతా వైఎస్, జగన్ హయాంలోనే జరిగిందని చెప్పారు. విద్య, వైద్య రంగంలో జగన్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని.. దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందని తెలిపారు. 27వ తేదీన జరిగే బహిరంగ సభ విజయవంతమవుతుందని.. దేవుడు ఆశీస్సులు సీఎం జగన్‌కు ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Updated Date - Jan 25 , 2024 | 08:37 PM

Advertising
Advertising