ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pardasaradhi: సచివాలయ సిబ్బందితోనే పింఛన్ల పంపిణీ.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Jun 24 , 2024 | 04:18 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చేసిన ఐదు సంతకాలకు కేబినెట్ ఆమోదించింది. అయితే కేబినెట్ భేటీలో చర్చించిన విషయాలను మంత్రి కొలుసు పార్థసారధి (Kolusu Parthasarathy) వెల్లడించారు.

Kolusu Parthasarathy

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చేసిన ఐదు సంతకాలకు కేబినెట్ ఆమోదించింది. అయితే కేబినెట్ భేటీలో చర్చించిన విషయాలను మంత్రి కొలుసు పార్థసారధి (Kolusu Parthasarathy) వెల్లడించారు. తొలి కెబినెట్ సమావేశం జరిగిందని.. ప్రజలకు భరోసా కల్పించే ప్రభుత్వం వచ్చిందని తెలిపారు. పెన్షన్లు పంపిణీ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని .. 65.30 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని వివరించారు. సచివాలయ సిబ్బందే ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేపడతారని చెప్పుకొచ్చారు. మెగా డీఎస్సీపై నిర్ణయం కేబినెట్లో నిర్ణయించామని చెప్పారు. ఉపాధ్యాయుల నియామకాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని.. కానీ టీచర్ల నియామకానికి చంద్రబాబు హై ప్రయార్టీ ఇచ్చారని అన్నారు.


16,347 పోస్టులతో భర్తీ చేశామని తెలిపారు. ఆరు నెలకొకసారి నిర్వహించే టెట్ పరీక్షలను గత ప్రభుత్వం నిర్వహించలేని.. దీని వల్ల నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందన్నారు. నాణ్యత కలిగిన విద్యని అందించేలా జాతీయ విద్యా విధానాన్ని స్టడీ చేస్తామని అన్నారు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు.ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ పేరు చెబితేనే భూ యజమానులు తమపై పిడుగుపాటు పడ్డట్లు ఫీలయ్యారని చెప్పుకొచ్చారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి.. గత ప్రభుత్వం తెచ్చిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలున్నాయన్నారు. అలాంటి భయంకరమైన చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని పార్థసారధి తెలిపారు.


బకాయిలతో సహా రూ. 7 వేల పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. పెన్షన్ పెంపు వల్ల నెలకు రూ. 810 కోట్ల భారాన్ని భరిస్తున్నామని అన్నారు. ఏడాదికి రూ. 33, 709 కోట్లు పెన్షన్ల నిమిత్తం పంపిణీ చేయబోతున్నామని తెలిపారు. స్కిల్ సెన్సస్ చేపడతామని చెప్పారు. అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నామని అన్నారు. పౌష్టికాహారాన్ని పేదలకు రూ. 5కే అందిస్తున్నామని తెలిపారు. మొత్తంగా 203 అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం మూసేసిందన్నారు. వీటిల్లో 183 క్యాంటీన్లను త్వరలో ప్రారంభించబోతున్నామని.. మిగిలిన 20 క్యాంటీన్లను తర్వాత ప్రారంభిస్తామని తెలిపారు.


హెల్త్ యూనివర్శిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెడుతూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. దమ్మాలపాటి శ్రీనివాసును ఏజీగా కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. గంజాయి నివారణకు ఐదుగురు సభ్యులతో కేబినెట్ సబ్ కమిటీ వేసిందన్నారు. పంచాయతీ, మున్సిపాల్టీల్లో పారిశుద్ధ్య పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి మండలి ఆదేశించదన్నారు. ఈ నెలాఖరు నుంచి ఏడు శ్వేత పత్రాలను విడుదల చేయబోతున్నామని స్పష్టం చేశారు. పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం, శాంతి భద్రతలు, మద్యం, శాండ్ అండ్ మైన్ వంటి వాటిపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని కొలుసు పార్థసారధి తెలిపారు.

Updated Date - Jun 24 , 2024 | 10:06 PM

Advertising
Advertising