ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Lokesh: ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు: మంత్రి లోకేష్

ABN, Publish Date - Jun 25 , 2024 | 01:54 PM

అమరావతి: ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ స్వర్ణకారులకు హామీ ఇచ్చారు. మంగళవారం లోకేష్ నిర్వహించిన ప్రజాదర్బార్‌కు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.

అమరావతి: ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ (Goldsmiths Corporation) ఏర్పాటు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (TDP National General Secretary), మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) స్వర్ణకారులకు హామీ ఇచ్చారు. మంగళవారం లోకేష్ నిర్వహించిన ప్రజాదర్బార్‌ (Prajadarbar)కు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ప్రజాదర్బార్‌కు తరలివచ్చారు. అందరి సమస్యలను ఓపిగ్గా విన్న యువనేత ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.


స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలు ఏ విధంగా ఉండాలి.. స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి వివరాలు ఇవ్వాలని మంత్రి లోకేష్ అధికారులను కోరారు. మంగళగిరిలో స్వర్ణకార వృత్తిపై ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారని, మంగళగిరిని గోల్డ్ హబ్‌గా రూపొందిస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని లోకేష్ చెప్పారు.


ఆర్కే రైట్ హ్యాండ్‌పై చర్యలు తీసుకోండి...

ఉండవల్లి పంచాయతీలో మహిళా పారిశుద్ధ్య కార్మికులపై లైంగిక వేధింపులతో పాటు ఉద్యోగులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న సూపర్ వైజర్ పిల్లి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రైట్ హ్యాండ్‌గా పేరుగాంచిన డి.రాంబాబును విధుల నుంచి తొలగించాలని మహిళా కార్మికులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అలాగే తమ వేతనాలు పెంచాలని, రైతు కూలీ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని యువనేతను కోరారు. మహిళా పారిశుద్ధ్య కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ వారికి హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ కార్యాలయాలకు నోటీసులు

నీట్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలంటూ ఎస్ఎఫ్ఐ నిరసన ర్యాలీ..

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఇంఛార్జి దీపాదాస్ మున్షీ ఫోన్

నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న తెలంగాణ ఎంపీలు

అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని పట్టుకున్న పోలీసులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 25 , 2024 | 02:48 PM

Advertising
Advertising