Minister Narayana:సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆ పథకాన్ని అమలు చేస్తున్నాం.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Oct 29 , 2024 | 04:01 PM
'పీఎం స్వనిధి'' పథకం ద్వారా పేదలకు ఆర్థిక సాయం అందించి వారి అభివృద్దికి కృషి చేసినందుకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందజేసిందని మంత్రి నారాయణ తెలిపారు. ఈ పథకాన్ని సమర్థంగా వినియోగించుకుని పేదరికం నుంచి బయటపడిన లబ్ధిదారులను మంత్రి నారాయణ సన్మానించారు. పేదల ఆదాయం రెండింతలు చేయాలన్న సీఎం ఆదేశాలతో పథకాన్ని అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు.
విజయవాడ: పేదలంతా పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇవాళ(మంగళవారం) జరిగిన కార్యక్రమంలో అవార్డులను పురపాలక శాఖ మంత్రి నారాయణ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ... పీఎమ్ స్వనిధి పథకం సమర్థంగా అమలు చేసినందుకు జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి నారాయణ వివరించారు.
38 మంది అధికారులకు పీఎం స్వనిధి ప్రైస్ అవార్డులను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. పలు మున్సిపాల్టీల కమిషనర్లు, బ్యాంకు అధికారులకు అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. పీఎం స్వనిధి పథకం ద్వారా పేదలకు ఆర్థిక సాయం అందించి వారి అభివృద్ధికి కృషి చేసినందుకు అవార్డులు అందజేసిందని మంత్రి నారాయణ వివరించారు. ఈ పథకాన్ని సమర్థంగా వినియోగించుకుని పేదరికం నుంచి బయటపడిన లబ్ధిదారులను మంత్రి నారాయణ సన్మానించారు. పేదల ఆదాయం రెండింతలు చేయాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో పీఎం స్వనిధి పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి నారాయణ ఉద్ఘాటించారు. పీఎం స్వనిధి పథకం కింద తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే లక్షల్లో రుణాలు పొందవచ్చని మంత్రి నారాయణ తెలిపారు.
ఈ పథకం కింద లబ్ధిదారులకు రుణాలపై కేంద్ర ప్రభుత్వం 7శాతం వడ్డీ రాయితీ ఇస్తుందని అన్నారు. కేవలం 4.5శాతం వడ్డీ మాత్రమే లబ్ధిదారులు భరించాల్సి ఉంటుందని తెలిపారు. పీఎం స్వనిధి పథకం కింద 5లక్షల 48వేల 957.. దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. వచ్చిన దరఖాస్తుల్లో 5 లక్షల 2వేల 894 మంది పేదలకు రుణాలిచ్చారని గుర్తుచేశారు. పీఎం స్వనిధి అమల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులు, బ్యాంకర్లకు మంత్రి నారాయణ అభినందనలు తెలిపారు.
అవార్డులు గెలిచిన గుంటూరు, పుత్తూరు, రాయచోటి మేజర్ మన్సిపాలిటీ కమిషనర్లకు అభినందనలు తెలిపారు. అత్యుత్తమ పనితీరు కనబరిచి రాష్ట్ర స్థాయిలో అవార్డులు సాధించిన పలు మైనర్ మున్సిపాలిటీ కమిషనర్లు, బ్యాంకర్లకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పొదుపు మహిళలు వ్యాపారాలు చేస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. పేద మహిళలు లక్షాధికారులు కావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని అన్నారు. మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
PV Sindhu: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీసీ సింధు స్థల వివాదం
PV Sindhu: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీసీ సింధు స్థల వివాదం
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 29 , 2024 | 04:38 PM