Minister Narayana: విశాఖ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుపై మంత్రి సమీక్ష..
ABN, Publish Date - Jul 23 , 2024 | 08:13 PM
విశాఖ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు పనులపై ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టు కంపెనీల ప్రతినిధులతో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ సమావేశం నిర్వహించారు. మొదటి ఫేజ్‌లో భాగంగా పెందుర్తి, రెండో ఫేజ్‌లో గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో యూజీడీ పనులు చేయనున్నారు.
అమరావతి: విశాఖ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు పనులపై ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టు కంపెనీల ప్రతినిధులతో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమావేశం నిర్వహించారు. మొదటి ఫేజ్‌లో భాగంగా పెందుర్తి, రెండో ఫేజ్‌లో గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో యూజీడీ పనులు చేయనున్నారు. మురుగునీటి వ్యవస్థ ఆధునికీకరించడంతోపాటు రీసైక్లింగ్ వాటర్‌ను హెచ్‌పీసీఎల్, స్టీల్ ప్లాంట్‌కు ఇచ్చేలా సమీక్షలో మంత్రి నిర్ణయం తీసుకున్నారు.
టాటా ప్రాజెక్ట్స్ సంస్థ రూ.412కోట్లతో 226కి.మీ. మేర మొదటి ఫేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను చేపట్టింది. అయితే సెప్టెంబర్ నెలాఖరుకు ఆ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థకు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అలాగే కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు త్వరితగతిన విడుదల చేయాలని అధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఈనెల 26న అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో మంత్రి మరోసారి సమావేశం కానున్నారు. అలాగే వచ్చే వారం విశాఖలో పర్యటించి మంత్రి నారాయణ యూజీడీ పనులు పరిశీలించనున్నారు.
Updated Date - Jul 23 , 2024 | 08:13 PM