ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Narayana : విజయవాడ అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు

ABN, Publish Date - Nov 27 , 2024 | 08:43 PM

విజ‌య‌వాడ అభివృద్దికి సంబంధించి అధికారుల‌కు మంత్రి నారాయ‌ణ‌ దిశానిర్ధేశం చేశారు. న‌గ‌రంలో పూర్తి స్థాయిలో తాగునీటి స‌ర‌ఫ‌రా జ‌రిగేలా ట్యాంకుల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు.

విజ‌య‌వాడ‌: బుడమేరు వరద‌తో డ్యామేజి అయిన రోడ్లను తిరిగి నిర్మిస్తున్నామని మంత్రి నారాయ‌ణ తెలిపారు. న‌గ‌ర‌పాల‌క సంస్థ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఆర్డీఏ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఇతర అధికారులు హాజరయ్యారు. వీఎంసీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు,పెండింగ్ పనుల పూర్తి,టౌన్ ప్లానింగ్ అంశాలపై చర్చించారు. నగర పాలక సంస్థలోని అన్ని విభాగాల పనితీరుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. నగర అభివృద్ధికి అవసరమైన చర్యలపై అధికారులకు మంత్రి నారాయణ దిశానిర్దేశం చేశారు..


అభివృద్ది ప‌నులపై మంత్రి నారాయ‌ణ‌ దిశానిర్ధేశం

వీఎంసీ ప‌రిధిలో జ‌రుగుతున్న అభివృద్ది ప‌నులు,విభాగాల వారీగా ప‌నితీరుపై చ‌ర్చించారు. విజ‌య‌వాడ అభివృద్దికి సంబంధించి అధికారుల‌కు మంత్రి నారాయ‌ణ‌ దిశానిర్ధేశం చేశారు. న‌గ‌రంలో పూర్తి స్థాయిలో తాగునీటి స‌ర‌ఫ‌రా జ‌రిగేలా ట్యాంకుల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ... విజ‌య‌వాడ‌లో కొన్ని చోట్ల తాగునీరు అర‌గంట మాత్రమే ఇస్తున్నారని.. తన దృష్టకి ఎమ్మెల్యేలు తీసుకువచ్చారని తెలిపారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమృత్ ప్రాజెక్ట్ ప‌నులు నిలిచిపోయాయని చెప్పారు. ప‌నులు పూర్తయి ఉంటే విజ‌య‌వాడ‌లో తాగునీరు, డ్రైనేజి స‌మ‌స్యలు ప‌రిష్కారం అయ్యేవని అన్నారు. డ్రెయిన్స్‌లో ఉన్న పూడిక‌ను త్వరిత‌గ‌తిన తొల‌గించాల‌ని ఆదేశాలిచ్చారు. న‌గ‌రంలో కొంత‌మందికి ఇళ్లప‌ట్టాలు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉందని తెలిపారు. విజ‌య‌వాడ‌లో ఉన్న అన్ని స‌మ‌స్యల ప‌రిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక‌లు త‌యారుచేయాల‌ని ఆదేశించారు. అవ‌స‌ర‌మైన నిధుల కోసం సీఎం చంద్రబాబుతో మాట్లాడి విజ‌య‌వాడ‌ను అభివృద్ది చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.


రైతులకు న్యాయం జరిగేలా చర్యలు..

అమరావతి రైల్వేలైన్ వెళ్లే పలు గ్రామాల రైతులు, స్థానిక ఎమ్మెల్యేలతో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెదకూరపాడు, తాడికొండ ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, శ్రావణ్ కుమార్, కర్లపూడి, పెదపరిమి, తాడికొండ, నిడుముక్కల గ్రామాల రైతులు హాజరయ్యారు. అమరావతి మీదుగా వెళ్లే కొత్త రైల్వే లైన్ పరిధిలో ఆయా గ్రామాలు ఉన్నాయని రైతులు తెలిపారు. రైల్వే లైన్ కోసం భూసేకరణ కింద కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకోవాలని రైతులు కోరారు. రాజధానినీ ఆనుకుని ఉన్న గ్రామాలు కావడంతో తమకూ ల్యాండ్ పూలింగ్ అవకాశం ఇవ్వాలని రైతులు వినతిపత్రంలో తెలిపారు. సీఎం చంద్రబాబుతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.

Updated Date - Nov 27 , 2024 | 08:57 PM