Narayana: దాచేపల్లిలో డయేరియా పరిస్థితిపై మంత్రి నారాయణ సమీక్ష
ABN, Publish Date - Oct 25 , 2024 | 11:29 AM
Andhrapradesh: పల్నాడు జిల్లా దాచేపల్లిలో డయేరియా పరిస్థితిపై మంత్రి నారాయణ వరుసగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. దాచేపల్లిలో పరిస్థితి ఎలా ఉందంటూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం దాచేపల్లిలో పరిస్థితి అదుపులోనే ఉందని మంత్రికి కలెక్టర్ చెప్పారు.
అమరావతి, అక్టోబర్ 25: పల్నాడు జిల్లా దాచేపల్లిలో డయేరియా పరిస్థితిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) శుక్రవారం ఉదయం సమీక్ష సమావేశం నిర్వహించారు. పల్నాడు జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులతో మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం దాచేపల్లిలో డయేరియా అదుపులోనే ఉందని మంత్రికి కలెక్టర్ చెప్పారు. కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యాధికారులు తెలిపారు. మరోవైపు స్థానికంగా ఉన్న బోర్లను మూసివేసి నగరపంచాయతీ అధికారులు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నారు.
Tirupati: నాలుగు హోటళ్లకు బాంబు బెదిరింపులు..
కాగా.. దాచేపల్లిలో నగర పంచాయతీలోని అంజనాపురం కాలనీలో డయేరియా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వ్యాధి తీవ్రతో ఇప్పటికే ఇద్దరు మృతువాత పడగా, 16 మంది వాంతులు, విరేచనాలతో బాధుపడుతున్న పరిస్థితి. అయితే కలుషిత మంచి నీరు తాగడం వల్లే అతిసారం ప్రబలిందని అధికారులు నిర్ధారించారు. తాగునీటి పైపు లైన్లు మురుగు కాలువలో ఉండటం వల్ల నీరు కలుషితమై ఉండవచ్చని భావిస్తున్నారు. డయేరియాతో డిగ్రీ విద్యార్థి తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు (21), బండారు చిన వీరయ్య(63) మృతి చెందారు. వీరు ఇద్దరు మృతి చెందడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. డీఎంహెచ్‌వో డాక్టర్ రవి నేతృత్వంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కాలనీలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి డయేరియా లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి చికిత్స అందజేస్తున్నారు. కాలనీలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శిరి గ్రామాన్ని సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. కలెక్టర్ అరుణ్‌బాబు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కాలనీలో పరిస్థితిని సమీక్షించారు.
Spam Calls: స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్ చేస్తే చాలు.. స్పామ్ కాల్స్ నుంచి రిలీఫ్...
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దాచేపల్లి పరిస్థితిపై ఆరా తీసిన విషయం తెలిసిందే. డయేరియాతో ఇద్దరు చనిపోయిన విషయంపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన సీఎం.. డయేరియాకు కలుషిత నీరు కారణమా లేక.. వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే దాచేపల్లిలో పరిస్థితిని ముఖ్యమంత్రికి కలెక్టర్ వివరించారు. బోర్లను మూసి వేసి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఈరోజు స్థానికంగా ఉన్న బోర్లను మూసివేసిన నగరపంచాయతీ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
Hyderabad: ఎల్లమ్మా.. ఈ పనులయ్యేది ఎప్పుడమ్మా?
దుర్గమ్మ సేవలో మంత్రి నారాయణ
కాగా.. ఈరోజు ఉదయం మంత్రి నారాయణ విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సంద్భంగా మంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. అలాగే ఆలయ ఈవో కేఎస్ రామారావు అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని , చిత్రపటాన్ని మంత్రి నారాయణకు అందించారు.
ఇవి కూడా చదవండి..
AP Politics: షర్మిలపై జగన్‌కు ఎందుకంత ‘పగ’.. అంటే..
Elephants: ఓకేసారి 16 ఏనుగుల గుంపు.. హడలెత్తిపోయిన ప్రజలు
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 25 , 2024 | 12:08 PM