Minister Narayana: వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసింది..
ABN, Publish Date - Jul 29 , 2024 | 12:58 PM
గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల(Tidco houses)ను పూర్తిగా నాశనం చేసిందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ(Minister Ponguru Narayana) అన్నారు. రానున్న మూడు నెలల్లో టిడ్కో ఇళ్లకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
అమరావతి: గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల(Tidco houses)ను పూర్తిగా నాశనం చేసిందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ(Minister Ponguru Narayana) అన్నారు. రానున్న మూడు నెలల్లో టిడ్కో ఇళ్లకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని ఆయన మండిపడ్డారు. రాజధాని ప్రాంతాలు మందడం, దొండపాడులో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్, టిడ్కో ఎండీతో కలిసి ఆయన టిడ్కో గృహ సముదాయాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. "గత టీడీపీ ప్రభుత్వంలో 5లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చాం. వీటిలో 4,54,704 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచాం. 2019నాటికి 77,371 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి అయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ 3,13,842 ఇళ్లను 2,62,216కు తగ్గించింది. వైసీపీ దిగిపోయే సమయానికి కేవలం 90వేల ఇళ్లు మాత్రమే పూర్తి చేయగలిగారు.
జగన్ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసింది. వచ్చే మూడు నెలల్లో టిడ్కో ఇళ్ల సముదాయాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏపీ ప్రభుత్వ ఖజానా మెుత్తం ఖాళీ చేసి వైసీపీ ప్రభుత్వం వెళ్లిపోయింది. ప్రజలు కట్టిన పన్నుల ఆదాయం కూడా వాడేసింది. టిడ్కో లబ్ధిదారులను బ్యాంకులు ఇబ్బంది పెట్టకుండా గడువు పెంచాలని కోరతాం. రాజధాని రైతులకు త్వరలోనే కౌలు డబ్బులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు" అని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CPI Ramakrishna: అమరావతికి కేంద్రం ఇచ్చే రూ.15వేల కోట్లు గ్రాంట్‌గా మార్చాలి..
Cyber Crime: సీబీఐ అధికారులమంటూ మహిళకు రూ.26లక్షలు టోకరా..
Updated Date - Jul 29 , 2024 | 01:00 PM