ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Satyakumar: అసమర్థ వ్యక్తి జగన్.. సీఎం ఎలా అయ్యారు?: మంత్రి సత్యకుమార్

ABN, Publish Date - Sep 15 , 2024 | 11:06 AM

న్యూఢిల్లీ: ఇటువంటి అసమర్థ వ్యక్తి వైఎస్ జగన్ సీఎం ఎలా అయ్యారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి నాలుగేళ్లు నిండాయని, ఇప్పటికీ పూర్తిగా నిర్మాణం అయ్యింది ఒక్కటి లేదని, సగం పైగా పునాదుల దశలోనే ఉన్నాయని విమర్శించారు.

న్యూఢిల్లీ: ఇటువంటి అసమర్థ వ్యక్తి వైఎస్ జగన్ (YS Jagan) సీఎం ఎలా అయ్యారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ (Minister Satyakumar) ఎక్స్ (X) వేదికగా ప్రశ్నించారు. నరేంద్రమోదీ (PM Modi) ప్రభుత్వం మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీల నిర్మాణం (Construction of 17 Medical Colleges) మొదలుపెట్టి నాలుగేళ్లు నిండాయని, ఇప్పటికీ పూర్తిగా నిర్మాణం అయ్యింది ఒక్కటి లేదని, సగం పైగా పునాదుల దశలోనే ఉన్నాయని విమర్శించారు. కళాశాల హాస్టల్ భవనాలు పూర్తి చేయకుండానే గత సంవత్సరమే ఆర్భాటంగా రాజమండ్రి వైద్య కళాశాల ప్రారంభించారని, ఈ ఏడాది రెండో సంవత్సరం విద్యార్థులకు తాత్కాలిక భవనాలలోనే తరగతులు నడపాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.


మెడికల్ కౌన్సిల్ జూలై నెలలోనే అనుమతి నిరాకరించిన విషయం తెలియదా? అంత ఎందుకు.. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి కాలేదని.. 48శాతం బోధనా సిబ్బంది లేరన్న విషయం మరిచారా? అని మంత్రి సత్యకుమార్ ప్రశ్నించారు. అనుమతి తీసుకుని విద్యార్థులను ఎక్కడ చదివించాలి? చెట్ల కింద?.. అమ్మాయిలను ఎక్కడ ఉంచాలి? షెడ్ల కింద?.. అని నిలదీశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఎందుకు ఆడుకోవాలనుకున్నారంటూ దుయ్యబట్టారు. ఇటువంటి అబద్దాలను ప్రచారం చేస్తున్నారనే ప్రజలు వైసీపీకి 151 నుంచి 11 కు దించారని.. అయినా బుద్ధి తెచ్చుకోకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్ మారాలని, ప్రజాభిప్రాయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని సూచించారు. లేదంటే ప్రజలు బెంగుళూరు పాలస్ దాకా తరిమికొడతారని మంత్రి సత్యకుమార్ అన్నారు.


మెడికల్ కాలేజీలపై అంతులేని నిర్లక్ష్యం

కాగా రాష్ట్రంలో వైద్య విద్య పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్‌ కాలేజీల దుస్థితికి మాజీ సీఎం జగనే కారణమని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మిస్తామని నానా ఆర్భాటం చేసిన జగన్‌, వాటిపై పూర్తి నిర్లక్ష్యం వహించారని ధ్వజమెత్తారు. ఈ కాలేజీలను రూ.8,480 కోట్లతో నిర్మించాలని గత ప్రభుత్వం భారీ ప్రణాళిక వేసి చతికిలపడిందని ఎద్దేవా చేశారు. ఇందులో రూ.4,948 కోట్లు నాబార్డు, కేంద్రం, సీఎస్ఎస్ కింద తేవాలని నిర్ణయించిందని చెప్పారు. ఐదేళ్ల పాలనలో రూ.2,125 కోట్ల పనులు (25శాతం) మాత్రమే గత ప్రభుత్వం చేయగలిగిందని తెలిపారు. అందులో రూ.1,415 కోట్ల బిల్లులే చెల్లించారని, ఇంకా రూ.674 కోట్ల బిల్లులు వివిధ నిర్మాణ సంస్థలకు జగన్‌ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని మంత్రి వివరించారు. పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తే తప్ప కాలేజీల నిర్మాణం చేపట్టలేమని ఆ సంస్థలు తేల్చిచెప్పేశాయని అన్నారు. గతంలో చెల్లించిన రూ.1,415 కోట్లలో ఒక్క రూపాయి కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదని, కేంద్రం సీఎస్ఎస్‌ కింద, నాబార్డు విడుదల చేసిన నిధులతో చెల్లింపులు చేసేసి, తాము ఏదో చేసినట్లు జగన్‌ చెప్పుకున్నారని ఆరోపించారు. తన సొంత నియోజకవర్గం పులివెందుల కాలేజీపై కూడా ఆయనకు చిత్తశుద్ధి లేదని, ఇప్పటికీ ఆ కాలేజీ పనులు పూర్తి చేయలేదని 47.5 శాతం వైద్య సిబ్బంది, 36.92 శాతం ట్యూటర్ల కొరత ఉందని ఎన్‌ఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసిందని చెప్పారు. ఈ లోటులను మూడు నెలల వ్యవధిలో కూటమి ప్రభుత్వం ఎలా పూర్తి చేయగలదో జగనే చెప్పాలన్నారు.


రెండోదశలో నిర్మించాల్సిన మరో 4 కాలేజీలు, మూడోదశలో నిర్మించాల్సిన 6 కాలేజీల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. పాత మెడికల్‌ కాలేజీల్లో ఉన్న సిబ్బందిని కొత్త కాలేజీకి బదిలీ చేసి పాతవాటిలో వైద్య విద్య, వైద్య సేవల నాణ్యతను కూడా జగన్‌ ప్రభుత్వం చెడగొట్టిందని ఆరోపించారు. ఈ విద్యా సంవత్సరంలో మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టకపోవడానికి కేవలం జగనే బాధ్యుడని మంత్రి స్పష్టం చేశారు. కచ్చితంగా 17 మెడికల్‌ కాలేజీల్లోనూ ఆడ్మిషన్లు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆయుష్‌ సేవల అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ లేనివిధంగా రూ.90.84 కోట్లు నిధులు అందించేందుకు సమ్మతించిందని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లలో ఆయుష్‌ విభాగానికి కేవలం రూ.38 కోట్లు మాత్రమే వచ్చాయని వివరించారు.


రాష్ట్రంలో 90 ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలను ఎన్‌ఏబీహెచ్‌ గుర్తింపు కోసం పంపగా, 89 కేంద్రాలకు మంజూరు లభించిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఉన్నందున మరో కళాశాల నిర్మాణానికి సాయం కోరగా కేంద్రం సానుకూల స్పందించిందని చెప్పారు. ధర్మవరంలో నూతన ఆయుర్వేద కాలేజీ, దానికి అనుబంధంగా 100 పడకల ఆస్పత్రిని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఆయుర్వేద కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరానికి అదనంగా యూజీ, పీజీ సీట్ల కేటాయింపుపైనా కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. విశాఖలో 50 పడకల ఆయుష్‌ ఆస్పత్రికి రూ.8.50 కోట్లు, కాకినాడ ఆస్పత్రికి రూ.8 కోట్లు, ఆరోగ్య మందిరాలకు రూ.5.75 కోట్లు, ఆయుష్‌ కళాశాలలకు రూ.20 కోట్లు కేంద్ర నిధులు లభించనున్నట్లు మంత్రి సత్యకుమార్ వివరించారు.

Updated Date - Sep 15 , 2024 | 11:06 AM

Advertising
Advertising