MP Raghurama: ఆ సినిమా చూసి సీఎం జగన్ భయపడ్డారు
ABN, Publish Date - Feb 16 , 2024 | 03:11 PM
మనసున్న ప్రతి ఒక్కరూ ‘రాజధాని ఫైల్స్’ సినిమా చూడాలని నర్సాఫురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama Krishnaraju) అన్నారు. ఈ చిత్ర నిర్మాతకు, డైరెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఢిల్లీ: మనసున్న ప్రతి ఒక్కరూ ‘రాజధాని ఫైల్స్’ సినిమా చూడాలని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama Krishnaraju) అన్నారు. ఈ చిత్ర నిర్మాతకు, డైరెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. అమరావతి రైతులకు సీఎం జగన్ ఏ రకంగా అన్యాయం చేశారో ఈ సినిమాలో చూపించారన్నారు. ఈ చిత్రంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని, రాబోయే ఎన్నికల ముందు తమకు ఇబ్బంది అవుతుందని భావించి వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లారన్నారు. హైకోర్టు ఆర్డర్ రాకముందే పోలీసులు నిన్న(గురువారం) థియేటర్‌కు వెళ్లారన్నారు. ఈ సినిమా ద్వారా జగన్ భయపడ్డారని ఎద్దేవా చేశారు.
ఈ చిత్రంలో తాను కూడా యాక్టింగ్ చేయాల్సి ఉండేదని.. కానీ కొన్ని కారణాలతో చేయలేకపోయానని తెలిపారు. ‘రాజధాని ఫైల్స్’ సినిమా చూసిన వారికి ఎన్నికల ముందు జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయని వివరించారు. వైసీపీ నేతలు శపథం, వ్యూహం సినిమాలు తీస్తారని.. వేరే వాళ్లు సినిమాలు తీస్తే మాత్రం ఒప్పుకోరని అన్నారు. ‘యాత్ర 2’ సినిమాకు జనాలు లేరని.. ప్రైవసీ కొరకు కొన్ని జంటలు వెళ్తున్నాయని చెప్పారు. ‘యాత్ర 2’ అట్టర్ ప్లాప్ కన్నా పెద్ద ప్లాప్ అని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు రాజధాని రైతులు భూములు ఇచ్చారని గుర్తుచేశారు. జగన్మోహన్ రెడ్డి చంద్రముఖి ఇంటింటికీ వస్తుందని మాటలు మాట్లాడుతున్నారని.. ఆయన కన్నా.. చంద్రముఖి అంత బ్యాడ్ ఏమీ కాదన్నారు. ‘హూ కిల్ బాబాయ్’ అనే సినిమా కూడా త్వరలో రావొచ్చని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
Updated Date - Feb 16 , 2024 | 04:18 PM