Share News

Crime News: నకరేకల్లు డబుల్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ

ABN , Publish Date - Dec 18 , 2024 | 08:56 AM

నకిరేకల్‌లో దారుణం జరిగింది. తండ్రి ఉద్యోగం కోసం ఇద్దరు సోదరులను యువతి హత్య చేసింది. ఆ తరువాత మృతదేహాలను కాల్వల్లో పడేసింది. ఈ కేసులో విచారణ జరిపిన పోలీసులు మర్డర్ మిస్టరీని చేధించారు. నిందితురాలు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. ఆమెకు సహకరించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.

Crime News: నకరేకల్లు డబుల్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ

పల్నాడు జిల్లా: నకరేకల్లు (Nakarekallu) డబుల్ మర్డర్ కేసు (Double Murder Case)లో మిస్టరీ (Mystery) వీడింది. విచారణ జరిపిన పోలీసులు (Police) కేసును చేధించారు. ప్రియుడుతో కలిసి కృష్ణవేణి పక్క స్కెచ్ వేసింది. సుపారీ ఇచ్చి మరీ అన్నల హత్యలకు స్కెచ్ వేసింది. నిందితురాలు కృష్ణవేణితో పాటు ప్రియుడు దానయ్య మరో నలుగురు మైనర్లు హత్యలో పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కృష్ణవేణితో పాటు ప్రియుడు దానయ్య, మరో నలుగురు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 26వ తేదీన రామకృష్ణను ఇంట్లో చున్నీ బిగించి హత్య చేసి గొరంట్ల కాల్వ లో పడేశారు. అలాగే డిసెంబర్ 10న కానిస్టేబుల్ గోపి కృష్ణను ఇంట్లో చున్నీ బిగించి హత్య చేసి గుంటూరు బ్రాంచ్ కెనాల్ పడేశారు.


పూర్తి వివరాలు..

బంధాలు, బాంధవ్యాలకు నేటి సమాజంలో విలువ లేకుండా పోతోంది. డబ్బే ప్రపంచంగా లోకం మారిపోతోంది. డబ్బు, ఆస్తి కోసం ఎంత దూరం వెళ్లేందుకైనా ఏ మాత్రం ఆలోచించరు. డబ్బు ఉంటే చాలు ఇంకేది అవసరం లేదు అన్నట్లు సమాజం తయారైంది. డబ్బుల కోసం, ఉద్యోగాల కోసం ఎంతటికైనా దిగజారిపోతున్నారు. తమ మార్గానికి అడ్డు వస్తున్నారంటే అది కన్న తల్లిదండ్రులైనా, తోడబుట్టిన వారైనా వారిని అడ్డుతొలగించేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అనేక మంది ఎంతో కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. మరికొందరికి తండ్రి వారసత్వంగా అంటే తండ్రి హఠాత్తుగా మరణిస్తే ఉద్యోగం వస్తుంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న తండ్రి.. సర్వీసులో ఉండి చనిపోతే కుమారులకు ఆ ఉద్యోగం వస్తుంది. అయితే తండ్రి ఉద్యోగం కోసం ఓ మహిళ చేయకూడని పని చేసి ఇప్పుడు వార్తల్లో నిలిచింది. తోడబుట్టువులు అని కూడా చూడాకుండా దారుణానికి పాల్పడింది. ఆమె చేసిన దారుణం చూసి పోలీసులే అవాక్కయ్యారు. ఇంతకీ ఆ మహిళ చేసిన దారుణం ఏంటి.. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆమె చేసిన పనికి ఎవరు బలి అయ్యారో ఇప్పుడు చూద్దాం.

జిల్లాలోని నకిరేకల్‌లో దారుణం జరిగింది. తండ్రి ఉద్యోగం కోసం ఇద్దరు సోదరులను ఓ యువతి హత్య చేసింది. ఆ తరువాత మృతదేహాలను కాల్వల్లో పడేసింది. కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో నకిరేకల్‌కు చెందిన పోలరాజు మృతి చెందాడు. పోలరాజు ఉద్యోగం కోసం కుమార్తె కృష్ణవేణి మర్డర్ స్కెచ్ వేసింది. అన్న గోపి, తమ్ముడు రామకృష్ణను హత్య చేసి మృతదేహాలను గుంటూరు బ్రాంచ్ కెనాల్, గోరంట్ల మేజర్ కాలువలో పడేసింది. ఆ తరువాత పోలీసులకు లొంగిపోయింది.


ఆస్తి కోసం తోడబుట్టిన వారిని దారుణంగా హత్య చేసి కాలువలో పడేసిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నకిరేకల్లుకు చెందిన పోలరాజు ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన ప్రభుత్వ ఉద్యోగం కోసం కూతురు కృష్ణవేణి ఘాతుకానికి పాల్పడింది. తన తండ్రి ఉద్యోగం తనకు కావాలనే ఉద్దేశంతో తన తోబుట్టువులైన గోపి, రామకృష్ణలను దారుణంగా చంపేసి మృతదేహాలను కాలువల్లో పడేసింది. గోపీ.. బొల్లాపల్లి స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. రామకృష్ణ నిరుద్యోగి. అయితే వీరిద్దరికీ తండ్రి ఉద్యోగం రాకుండా.. తనకే రావాలన్న ఉద్దేశంతో ఇద్దరినీ చంపేసి గుంటూరు బ్రాంచ్ కెనాల్‌లో ఒకరిని , గోరంట్ల మేజర్ కాలువలో మరొకరిని పడేసింది.

వారం రోజుల క్రితం ముప్పాళ్ల బ్రాంచ్ కెనాల్ వద్ద గుర్తుతెలియని మృతదేహం లభించిన నేపథ్యంలో... ఆ మృతదేహం ఇద్దరు సోదరులలో ఒకరిదిగా పోలీసులు అనుమానించగా.. సోదరి మర్డర్ స్కెచ్ బయటపడింది. ఈ ఘాతుకానికి పాల్పడిన కృష్ణవేణి పోలీసుల ఎదుట లొంగిపోయి.. చేసిన నేరాన్ని పోలీసులకు వివరించింది. అయితే తండ్రి ఉద్యోగం కోసం ఇద్దరు సోదరులను సోదరి ఇంత కిరాతకంగా చంపేయడం నకిరేకల్ వాసులను తీవ్రంగా కలిచివేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్ఎస్ నేతలు రోజుకో వేషం..

గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో వెలుగులోకి కొత్త నిజాలు

కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విందు

వచ్చే ఎన్నికల్లోపు 20 లక్షల మందికి ఉద్యోగాలు

రోగుల చెంతకే వైద్య సేవలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 18 , 2024 | 08:56 AM