Manohar: డయేరియా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
ABN, Publish Date - Feb 17 , 2024 | 06:34 PM
డయేరియా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar ) అన్నారు. శనివారం జీజీహెచ్‌లో డయేరియాతో బాధపడుతున్న వారిని మనోహర్ పరామర్శించారు.
గుంటూరు జిల్లా: డయేరియా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar ) అన్నారు. జీజీహెచ్‌లో డయేరియాతో బాధపడుతున్న వారిని మనోహర్ శనివారం నాడు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 200 మంది రోగులు డయేరియాతో జీజీహెచ్‌కు వచ్చారని చెప్పారు. వీరికి ప్రభుత్వం సరైన వైద్యం అందించాలని కోరారు. ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా.. మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో డోర్ టు డోర్ సర్వే చేయాలని కోరారు.
రూ.1400 కోట్ల బడ్జెట్ ఉన్న కార్పొరేషన్‌లో ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని ప్రశ్నించారు. ఐదేళ్లలో ఒక ప్రణాళిక ప్రకారం తాగునీటిని అందించలేకపోయారని మండిపడ్డారు. ఇప్పటికే డయేరియాతో ముగ్గురు చనిపోయారని.. ఎంతో మంది ఆస్పత్రి పాలయ్యారని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు జనసేన అండగా ఉంటుందని నాదెండ్ల మనోహర్ ధైర్యం చెప్పారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 17 , 2024 | 11:02 PM