Nakka Anand Babu: అంబేద్కర్ పేరుతో వైసీపీ ప్రభుత్వం వందల కోట్ల దోపిడీ
ABN, Publish Date - Jan 17 , 2024 | 07:47 PM
అంబేద్కర్ పేరుని అడ్డంపెట్టుకుని వందల కోట్ల రూపాయల దోపిడీకి వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) తెరలేపిందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ( Nakka Anand Babu ) ఆరోపించారు.
అమరావతి: అంబేద్కర్ పేరుని అడ్డంపెట్టుకుని వందల కోట్ల రూపాయల దోపిడీకి వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) తెరలేపిందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ( Nakka Anand Babu ) ఆరోపించారు. శాఖమూరులో అంబేద్కర్ స్మృతి వనం ప్రాజెక్టును బుధవారం టీడీపీ దళిత నేతలు సందర్శించారు. దొంగిలించిన విగ్రహాలు, స్మృతి వనం ప్రాజెక్టు నిర్వీర్య ప్రాంతాలను నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ... హైదరాబాద్‌లో రూ.150 కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటయితే.. ఏపీలో కూడా అలాంటి విగ్రహానికే రూ.400కోట్లు ఎలా అయ్యాయని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ కనుసన్నల్లోనే అంబేద్కర్ విగ్రహాలు దోపిడీకి గురయ్యాయని నక్కా ఆనంద్ బాబు అన్నారు.
రాజ్యాంగంపై చిత్తశుద్ధి లేదు: వర్ల రామయ్య
రాజధాని అమరావతి లాగానే అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటులో కూడా జగన్మోహన్‌రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. గత ఐదేళ్లలో దళితుల పట్ల జగన్ చేసిన పాపాలు ఎప్పటికీ పోవని చెప్పారు. అంబేద్కర్, ఆయన రాసిన రాజ్యాంగం పైనా సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి, గౌరవం లేదని మండిపడ్డారు. ఒక వర్గం వారిని అణిచివేయడానికే అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో పెట్టారన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ భారీ విగ్రహాన్ని ఏపీలో ఎందుకు ఏర్పాటు చేయలేదని వర్ల రామయ్య ప్రశ్నించారు.
Updated Date - Jan 17 , 2024 | 09:57 PM