ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: హరిప్రసాద్‌కు ఎమ్మెల్సీ ఎందుకో ఇచ్చారో చెప్పిన పవన్ కళ్యాణ్..

ABN, Publish Date - Jul 04 , 2024 | 06:42 PM

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు పి.హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు.

Pawan Kalyan and Hari Prasad

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)కు పి.హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన పార్టీ(Janasena Party)కి హరిప్రసాద్ ఎంతో విలువైన సేవలు అందించారన్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలు నిస్వార్థమైనవని కొనియాడారు. అంకిత భావంతో పార్టీ కోసం పని చేశారని తెలిపారు. శాసన మండలిలో ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి కోసం బలంగా చర్చించే అవగాహన హరిప్రసాద్‌కు ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడేటప్పుడు భాషలో కంటే భావంలో వాడి వేడి చూపే నైపుణ్యం కచ్చితంగా ప్రజా ప్రయోజనకరమైన చర్చలకు అవకాశం ఇస్తుందని తెలిపారు.

Anitha: పిన్నెల్లిని జగన్ పరామర్శించడంపై హోంమంత్రి అనిత హాట్ కామెంట్స్


రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా ..

జనసేన పార్టీ ప్రారంభం తర్వాత హరిప్రసాద్ పవన్ కళ్యాణ్‌తో ప్రయాణిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా వ్యవహరించారు. జనసేనలో చేరడానికి ముందు ఆయన జర్నిలిస్ట్‌గా వివిధ పత్రికలు, ఛానళ్లలో పనిచేశారు. జనసేన మీడియా విభాగానికి సంబంధించిన అన్ని పనులను ఆయన పర్యవేక్షించేవారు. హరిప్రసాద్ పార్టీకి అందించిన సేవలను గుర్తించిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.

MP Kesineni Sivanath: విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుకు కేంద్రమంత్రి పచ్చజెండా..


ఎమ్మెల్యే కోటాలో..

శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీ పదవులకు ఖాళీలు ఏర్పడంటో.. వాటి భర్తీకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 164 మంది శాసనసభ్యుల బలం ఉండటంతో ఆ రెండింటిని ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశం ఉంది. కూటమి తరపున టీడీపీ నుంచి మాజీ మంత్రి సి.రామచంద్రయ్యను, జనసేన నుంచి హరిప్రసాద్‌ను ఎంపిక చేశారు.


YSRCP: ఆరోపణలు, ప్రత్యారోపణలతో రసాభాసగా వైసీపీ సమావేశం

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jul 04 , 2024 | 06:42 PM

Advertising
Advertising