ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Raghurama: నాకు ఫోన్ చేసి వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు

ABN, Publish Date - Mar 06 , 2024 | 10:46 PM

పీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కొడుకు వాళ్ల పేటీఎం బ్యా‌చ్‌తో అసభ్యంగా బెదిరిస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు(Raghurama Krishna Raju) అన్నారు. బుధవారం నాడు ఢిల్లీ వేదికగా ఎంపీ రఘురామ మీడియాతో మాట్లాడుతూ..తన దగ్గర కూడా సజ్జల, పిల్ల సజ్జల, ఇతరుల నంబర్స్ ఉన్నాయని.. తాను కూడా అలా చేయొచ్చని అన్నారు.

ఢిల్లీ: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కొడుకు వాళ్ల పేటీఎం బ్యా‌చ్‌తో అసభ్యంగా బెదిరిస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishna Raju) అన్నారు. బుధవారం నాడు ఢిల్లీ వేదికగా ఎంపీ రఘురామ మీడియాతో మాట్లాడుతూ..తన దగ్గర కూడా సజ్జల, పిల్ల సజ్జల, ఇతరుల నంబర్స్ ఉన్నాయని.. తాను కూడా అలా చేయొచ్చని అన్నారు. రైతు భరోసా కేంద్రాలను అదే రైతు టోకరా కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. రైతులు స్వేచ్ఛగా తమ పంటను కూడా అమ్ముకొలేని పరిస్థితి ఉందన్నారు. రైతులు ధాన్యం అమ్ముకున్న డబ్బులు వెంటనే చెల్లించరని, కొన్ని చోట్ల మూడు నెలలకు డబ్బులు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమలో గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో డ్రిప్ ఇరిగేషన్ పెట్టారని చెప్పారు.

పంటలు బాగా పండేవిని.. ఇప్పుడు దాన్ని వైసీపీ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని ధ్వజమెత్తారు. వెలుగొండ ప్రాజెక్టులో చేసింది ఏమీ లేదని అన్నారు. రాయలసీమలో రైతులు దగపడ్డారని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో అందరూ దోపిడీకి గురయ్యారని.. జగన్ విజ్ఞప్తి చేస్తున్న రైతులు వదిలేయాలని హితవు పలికారు. రైతులకు గతంలో ట్రాక్టర్లు, పని ముట్లు ఇచ్చే వారని అవి ఏమీ రాష్ర్టంలో లేవని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు తాను ఓ విజ్ఞప్తి చేస్తున్నానని.. వచ్చే ప్రభుత్వంలో రైతులకు స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. రైతుల అంశాలు మ్యానిఫెస్టోలో పెట్టాలని సూచించారు. జగన్ తెచ్చిన వలంటరీ వ్యవస్థ ఉంటుందని చంద్రబాబు నాయుడు చెప్పారని అన్నారు. అందుకే వలంటరీలు విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో వలంటరీలు ఉండకూడదని.. డబ్బులు పంచే దాంట్లో భాగస్వామ్యం కావొద్దని ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 06 , 2024 | 11:00 PM

Advertising
Advertising