ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Raghurama: వైఎస్ షర్మిల భద్రతపై రఘురామ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Feb 01 , 2024 | 07:03 PM

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila)కు ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీ తగ్గించడంపై ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు(Kanumuru Raghu Rama Krishna Raju) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల ఢిల్లీకి వస్తున్నారని.. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని.. కేంద్రలోని పెద్దలను ఆమె అడుగుతారని తెలిసిందని అన్నారు.

ఢిల్లీ: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila)కు ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీ తగ్గించడంపై ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు(Kanumuru Raghu Rama Krishna Raju) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల ఢిల్లీకి వస్తున్నారని.. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని.. కేంద్రలోని పెద్దలను ఆమె అడుగుతారని తెలిసిందన్నారు. కేంద్ర హోమంత్రి అమిత్‌షాని కలిసి షర్మిల సెక్యూరిటీ గురించి కూడా అడగాలని విజ్ఞప్తి చేశారు. ప్రసుత్తం షర్మిలకు ఉన్న సెక్యూరిటీ తగ్గించారని.. ముందే షర్మిల భర్త అనిల్‌కు సెక్యూరిటీ తీసేశారని మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా రఘురామ మీడియాతో మాట్లాడుతూ.. రైల్వేజోన్‌కు ఏపీ ప్రభుత్వం స్థలం ఇవ్వలేదని... కేంద్ర రైల్వే శాఖ మంత్రి అన్నారని.. సీఎం జగన్ స్థలం ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. రైల్వే జోన్ కోసం కావాల్సిన 53 ఎకరాలు ఇవ్వలేరా అని ప్రశ్నించారు. వేలకు వేల ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకు విశాఖపట్నంలో స్థలాలు ఇస్తున్నారని.. మరీ రైల్వే జోన్‌కు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.రైల్వే జోన్ వస్తే ఉపాధి వస్తుందన్నారు. తాను ముందు నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కలుస్తుందని చెబుతున్నానని ఎంపీ రఘురామఅన్నారు.

అక్కడి నుంచే బరిలోకి దిగుతా..

కూటమి అభ్యర్థిగా రాబోయే ఎన్నికల్లో తాను నరసాపురం నుంచి బరిలో ఉంటానని ముందే చెప్పానన్నారు. ఈరోజు కూటమి తరఫున 13మంది పేర్లను ప్రకటించినట్లు వార్తలు వచ్చాయని చెప్పారు. వైసీపీ వాళ్లు తనకు సీటు ఇవ్వరని అన్నారు. ఆ పార్టీ నేతలకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదన్నారు. తనపై రాబోయే ఎన్నికల్లో బరిలో నిలబెట్టడానికి.. వైసీపీ రెండు రోజుల్లో అభ్యర్థిని వెతికి తెస్తుందని చెప్పారు. టీడీపీ, జనసేన, తనను అభిమానించే వారి బలంతో వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్లి అద్భుతమైన విజయం సాధిస్తామని తెలిపారు. వైసీపీ తరఫున ధర్మారెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని తెలిసిందన్నారు. విద్యావంతుడు పోటీ చేయడం మంచిదేనని వివరించారు. అరకు మహిళ ఎంపీ మాధవికి ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. తన నియోజకవర్గం పరిధిలో ఆక్వా పరిశ్రమ ఉందని.. అభివృద్ధిలో ఆక్వా ముందుకు వెళ్తుందని తెలిపారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం మారుతుందని.. ఆక్వా మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే సీటు కావాలని అంటున్నారన్నారు. ఎంపీలుగా ఉంటే కూడా ఎన్నో చేయొచ్చని తెలిపారు. వైసీపీలో ఎంపీ సీట్లను ఎవరు వద్దని అనరని చెప్పారు. సీఎం జగన్ ఢిల్లీకి వస్తారని అంటున్నారు.. ఆయనకు ప్రధాని మోదీ, కేంద్ర అగ్ర నేతలు అపాయిట్మెంట్ ఇప్పుడు ఇవ్వడం కష్టమని చెప్పారు. తనపై ఉన్న కేసు ఈనెల5వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుందని ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు.

Updated Date - Feb 01 , 2024 | 07:03 PM

Advertising
Advertising