AP Politics: కస్టోడియల్ టార్చర్‌పై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన RRR..
ABN, Publish Date - Jun 10 , 2024 | 08:22 PM
జగన్ ప్రభుత్వంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్(Custodial Torture)పై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు(RRR) గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీస్ కస్టడీలో హత్యాయత్నం చేశారంటూ పలువురు అధికారులను బాధ్యులుగా ఫిర్యాదులో చేర్చారు.
గుంటూరు: జగన్ ప్రభుత్వంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్(Custodial Torture)పై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు(RRR) గుంటూరు ఎస్పీ తుషార్ డూడీకి ఫిర్యాదు చేశారు. పోలీస్ కస్టడీలో హత్యాయత్నం చేశారంటూ పలువురు అధికారులను బాధ్యులుగా ఫిర్యాదులో చేర్చారు. CID మాజీ చీఫ్ సునీల్ కుమార్, IPS సీతారామాంజనేయులు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అప్పటి CID అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు లాఠీలతో కొట్టి తీవ్రంగా గాయపడితే.. కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చారంటూ గుంటూరు GGH సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి పేరునూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శిస్తే చంపేస్తానని ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ బెదిరించారంటూ ఎస్పీకి ఫిర్యాదులో వివరించారు.
For more Andhra Pradesh News and Telugu News Click here..
Updated Date - Jun 10 , 2024 | 08:22 PM