ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kadambari Jethwani Case: నటి జత్వానీ కేసులో సంచలన పరిణామం

ABN, Publish Date - Nov 14 , 2024 | 10:00 PM

ఏపీలో సంచలనంగా మారిన ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించిన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

విజయవాడ: ముంబై నటి కాదంబరీ జత్వానికి వైసీపీ పెద్దల వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జత్వానీ కేసుపై విజయవాడ కోర్టులో ఇవాళ(గురువారం) విచారణ జరిగింది. బెయిల్ మంజూరు చేయాలంటూ కుక్కల విద్యాసాగర్ పిటిషన్ వేశారు. జత్వాని తరపున లాయర్ శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. బెయిల్ ఇస్తే విద్యాసాగర్ కేసును ప్రభావితం చేస్తారని కోర్టుకు లాయర్ తెలిపారు. నిందితుడికి ఐపీఎస్ అధికారులు సైతం సహకరించారని అన్నారు. నిందితుడిని పోలీసులు డెహ్రాడూన్‌లో పట్టుకున్నారని చెప్పారు.


తప్పుడు పత్రాలు సృష్టించి బాధితులను 42రోజులు జైలులో ఉంచారని అన్నారు. విద్యాసాగర్‌కు బెయిల్ ఇస్తే వాస్తవాలు బయటకు రాకుండా చేస్తారని అన్నారు. నిందితుడు పారిపోయే అవకాశం ఉందని లాయర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులో బెయిల్ పిటిషన్‌పై ఈనెల 16వ తేదీన న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది.


కాగా.. జత్వానీ కేసులో ప్రధాన నిందితుడైన కుక్కల విద్యాసాగర్‌ను మూడు రోజుల సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో విజయవాడ జైల్లో ఉన్న విద్యాసాగర్‌ను సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకొని జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం గుంటూరులోని వారి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. కేసు విచారణ అధికారిగా ఉన్న సీఐడీ ఎస్పీ కేజీవి సరిత నిందితుడు విద్యాసాగర్‌ను సుదీర్ఘంగా విచారించారు. ఈ కేసులో పలువురు ఐపీఎస్‌ అధికారులు కూడా నిందితులుగా ఉన్న నేపథ్యంలో విచారణను అత్యంత గోప్యంగా కొనసాగిస్తున్నారు. సీఐడీ అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ స్వయంగా గుంటూరు కార్యాలయానికి వచ్చారు. గంటన్నర పాటు అక్కడే ఉన్నారు. దర్యాప్తు పరంగా తీసుకోవాల్సిన చర్యలతో పాటు విచారణలో రాబట్టాల్సిన అంశాలకు సంబంధించిన ప్రశ్నలను ఎస్పీ సరితకు వివరించారు.


ఏపీలో సంచలనంగా మారిన ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించిన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాదంబరి కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చాక విద్యాసాగర్‌ అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కొన్నిరోజులు ముంబైలో, మరికొన్ని రోజులు ఢిల్లీలో తలదాచుకున్నారని పోలీసులు గుర్తించారు. చివరకు డెహ్రాడూన్‌లోని ఓ రిసార్ట్‌ వద్ద అరెస్టు చేశారు. అక్కడి మూడో అదనపు చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపర్చిన తర్వాత ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడకు తీసుకువచ్చారు.


అయితే.. తనపై తప్పుడు కేసు నమోదుచేసి మానసికంగా వేధించారని కుక్కల విద్యాసాగర్‌తో పాటు ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ, పలువురు పోలీసు అధికారులపై జెత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఈ నెల 13న కేసు నమోదు చేశారు. ఇందులో కుక్కల విద్యాసాగర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. జెత్వానీ విజయవాడకు వచ్చి వాంగ్మూలం ఇచ్చినప్పటి నుంచి విద్యాసాగర్‌ పరారీలో ఉన్నారు. తాను నమోదు చేయించిన కేసుకు సంబంధించిన వివరాలు మీడియాలో ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా కాదంబరి వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఉన్నతాధికారులు విచారణాధికారిని నియమించారు. ఎన్టీఆర్‌ పోలీసు కమిషనరేట్‌లోని ఏసీపీ స్రవంతిరాయ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆమె కాదంబరితో పాటు తండ్రి నరేంద్రకుమార్‌ జెత్వానీ, తల్లి ఆశా జెత్వానీ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. 100 పేజీలతో విచారణ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పంపారు. కాదంబరి మొత్తం నాలుగుసార్లు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మూడుసార్లు పోలీసు కమిషనర్‌కు, నాలుగోసారి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. అజ్ఞాతంలోకి వెళ్లిన విద్యాసాగర్‌ను పట్టుకోవడానికి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను నియమించారు. ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.


ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ముగ్గురి సస్పెన్షన్ ఫైల్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. అధికార దుర్వినియోగ ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావులను డీజీపీ సస్పెండ్ చేశారు. డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కూడా వేటు పడింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. జీవో నంబర్ 1590, 1591,1592 విడుదల చేసింది. కాన్ఫిడెన్షియల్ అని వెబ్‌సైట్‌లో ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - Nov 14 , 2024 | 10:00 PM