ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Shanti Issue: వైసీపీ ఎంపీకి శాంతి భర్త ఛాలెంజ్..!!

ABN, Publish Date - Jul 18 , 2024 | 09:21 PM

శాంతికుమారి భర్త మదన్ మోహన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనితను ఈ రోజు విజయవాడలో కలిశారు. శాంతి ఇష్యూలో మీడియా ముందుకు వచ్చిన తర్వాత తనకు బెదిరిపు కాల్స్ వస్తున్నాయని వివరించారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు.

Madan Mohan On Shanti Kumari

విజయవాడ: శాంతికుమారి (Shanti Kumari) భర్త మదన్ మోహన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనితను ఈ రోజు విజయవాడలో కలిశారు. శాంతి ఇష్యూలో మీడియా ముందుకు వచ్చిన తర్వాత తనకు బెదిరిపు కాల్స్ వస్తున్నాయని వివరించారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. శాంతి బిడ్డకు తండ్రి ఎవరో డీఎన్ఏ టెస్ట్ చేయించాలని హోం మంత్రి అనితను మదన్ కోరారు. అన్ని వివరాలు పరిశీలించి చట్టపంగా చర్యలు తీసుకుంటామని మదన్ మోహన్‌కు హోం మంత్రి అనిత హామీనిచ్చారు.


నయవంచన

హోం మంత్రి అనితను కలిసిన తర్వాత మదన్ మీడియాతో మాట్లాడారు.‘నా‌ పోరాటంలో న్యాయం ఉంది. ఆ బిడ్డ నా బిడ్డ అని నన్ను శాంతి మోసం చేసింది. తరువాత నిలదీస్తే విజయసాయి రెడ్డికి పుట్టాడని చెప్పింది. ఇప్పుడు మాట మార్చి సుభాష్‌ పేరు చెబుతోంది. ఆ బిడ్డ ఎవరికి పుట్టారో తేలాలి. నాతో పాటు సుభాష్, విజయసాయి రెడ్డి డీఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి. నా బిడ్డ అని శాంతి నన్ను నయవంచన చేసింది. శాంతి తప్పు చేసింది. అందుకోసమే పదే పదే మాట మార్చింది. నిజం లేకుండా ఏ భర్త భార్య మీద ఇలా మాట్లాడారు అని’ సుభాష్ స్పష్టం చేశారు.


అజ్ఞాతంలో సుభాష్

‘సుభాష్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. ‌ఆ బాబుతో నాకు సంబంధం లేదని గతంలో చెప్పాడు. విజయసాయి రెడ్డి కోసం బిడ్డను‌ కన్నానని శాంతి స్వయంగా చెప్పంది. ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేలాలంటే డీఎన్ఏ టెస్ట్ చేయించాల్సిందే. ఇదే అంశంపై కోర్టులో పిటిషన్ వేస్తా. క్లినికల్‌గా సర్టిఫికెట్ తీసుకుంటే ఆ బిడ్డ గౌరవంతో జీవించే అవకాశం ఉంటుంది. శాంతి పచ్చి అబద్దాలు చెబుతుంది. శాంతి నాకు విడాకులు ఇవ్వలేదు. నన్ను బెదిరించి బలవంతంగా నా ‌చేత సంతకం‌ చేయించుకుంది. శాంతి చూపించేవి ఫేక్ డాక్యుమెంట్లు. ఆ బిడ్డ విషయంలో నాకు న్యాయం కావాలి. ఆ బిడ్టకు తండ్రి ఎవరో తేల్చాలి అని’ మదన్ మహన్ తేల్చి చెప్పారు.

Updated Date - Jul 18 , 2024 | 09:21 PM

Advertising
Advertising
<