ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Prajadarbar: ఆపన్నులకు అండగా మంత్రి లోకేష్ ‘ప్రజాదర్బార్’

ABN, Publish Date - Jun 28 , 2024 | 11:49 AM

అమరావతి: ఆపన్నులకు అండగా మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ నిర్వహిస్తున్నారు. సమస్యలు విన్నవించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి జనం పెద్ద ఎత్తున ఉండవల్లిలోని లోకేష్ నివాసానికి తరలివస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచే వస్తున్నారు.

అమరావతి: ఆపన్నులకు అండగా మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ‘ప్రజాదర్బార్’ (Prajadarbar) నిర్వహిస్తున్నారు. సమస్యలు విన్నవించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి జనం పెద్ద ఎత్తున ఉండవల్లిలోని లోకేష్ నివాసానికి తరలివస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచే వస్తున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ (Gudivada Amarnath) అండతో రూ. 4 కోట్ల విలువైన తమ భూమి కబ్జా (Land possession) అయిందని, తనకు న్యాయం చేయాలని కోరారు. విశాఖ జిల్లా, గాజువాక మండలం, దువ్వాడలో రూ.4 కోట్ల విలువైన తమ 84 సెంట్ల భూమిని గత వైసీపీ ప్రభుత్వ (YCP Govt.) అండతో దేవెళ్ల వెంకటరమణ, రావి సత్యనారాయణ కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలని గాజువాక మండలం, డ్రైవర్ కాలనీకి చెందిన చూచుకొండ శ్రీనివాసరావు, జాగరపు తాతారావు మంత్రి లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.


మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్, సీఐ బి.శ్రీనివాసరావు అండతో ఫోర్జరీ డ్యాక్యుమెంట్లు సృష్టించి సదరు భూమిని అక్రమించారని యువనేత ఎదుట బాధితులు వాపోయారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ తమకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. సమస్య విన్న మంత్రి నారా లోకేష్ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.


కరెంట్ బిల్లు సాకుతో వితంతు పెన్షన్ తొలగించారు..

విద్యుత్ షాక్‌తో రెండు చేతులు కోల్పోయిన తనకు వికలాంగ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం యర్రబాలెంకు చెందిన తాటిబోయిన రవీంద్ర మంత్రి నారా లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశాడు. కరెంట్ బిల్లు సాకుతో వైసీపీ ప్రభుత్వం తొలగించిన వితంతు పెన్షన్ పునరుద్ధరించాలని తాడేపల్లి మండలం, పోలకంపాడుకు చెందిన అనవాయమ్మ, హైమావతి మంత్రిని కోరారు. అందరి సమస్యలను సానుకూలంగా విన్న లోకేస్ పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదు..

రామోజీరావు సంస్మరణ సభ దృశ్యాలు..

జగన్ సర్కర్ చెప్పిందే.. కలెక్టర్లు పాటించారు..

ఓటమితో వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 28 , 2024 | 12:21 PM

Advertising
Advertising