ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: ఐదేళ్ల జగన్ పాలనపై మండిపడ్డ సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు..

ABN, Publish Date - Jun 07 , 2024 | 02:24 PM

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక పాలనపై సమతా సైనిక్ దళ్ (Samata Sainik Dal) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాలేటి ఉమామహేశ్వరరావు (Paleti Umamaheswara Rao), పిల్లి సురేంద్రబాబు (Pilli Surendra Babu) నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అరాచక పాలన అంతమొందించడానికి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కలిసికట్టుగా కృషి చేశారంటూ సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి ఉమామహేశ్వరరావు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

అమరావతి: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక పాలనపై సమతా సైనిక్ దళ్ (Samata Sainik Dal) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాలేటి ఉమామహేశ్వరరావు (Paleti Umamaheswara Rao), పిల్లి సురేంద్రబాబు (Pilli Surendra Babu) నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అరాచక పాలన అంతమొందించడానికి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కలిసికట్టుగా కృషి చేశారంటూ సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి ఉమామహేశ్వరరావు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై విపరీతంగా దాడులు చేశారని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి వారు గట్టి బుద్ధి చెప్పారన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మైనింగ్, లిక్కర్ని ఆదాయ వనరులుగా మార్చుకున్నారన్నారు. విపరీతంగా మైనింగ్ చేసి పర్యావరణానికి హాని కలిగించారని, పిచ్చి పిచ్చి మద్యం బ్రాండ్లతో పేదల జీవితాలతో ఆటలాడుకున్నారని పాలేటి ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ రెడ్డి ఒక్కొక్క వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించడానికి "ఐ ప్యాక్ టీమ్" ద్వారా రూ.40కోట్లు ఖర్చు పెట్టారని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు ఆరోపించారు. దీనిపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ చేశారు. వైకాపా నేతలు అయోధ్య రామిరెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి ఎన్నికల్లో పార్టీ గెలిచేందుకు సొంత వాహనాల్లో వందల కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గంలో ఐ పాక్ ద్వారా తరలించారని సురేంద్రబాబు ఆరోపించారు. దానికి తగిన సాక్ష్యధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ఆ నగదునే గ్రామ, మండల స్థాయిల్లో నాయకులు విచ్చలవిడిగా వెదజల్లారన్నారు. అంబటి రాంబాబు, తలశిలా రఘురాం, నందిగాం సురేశ్ సహా కొంతమంది నాయకులు రాష్ట్రంలో అక్రమ మైనింగ్ చేశారని, వీటన్నింటిపైనా దర్యాప్తు జరగాలన్నారు.


ఈ మేరకు పలు వినతులతో కూడిన మెమోరాండంను టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి పాలేటి ఉమామహేశ్వరరావు, పిల్లి సురేంద్రబాబు అందజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పథకాలన్ని జగన్ రద్దు చేశారని, ఆ పథకాలను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు వెంటనే పునరుద్ధరించాలని కోరారు. గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తారనే ప్రజలందరూ చంద్రబాబుని గెలిపించారన్నారు.

జగన్ హయాంలో రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందో అని ప్రజలందరూ కంగారుపడ్డారని, ఆ పార్టీలో ఉన్న ఎస్సీ నాయకులను హీనంగా చూశారంటూ దుయ్యబట్టారు. అందుకే జగన్‌కు కనీసం ప్రతిపక్ష హోదా సైతం రాష్ట్ర ప్రజలు ఇవ్వలేదన్నారు. ఎస్సీల మీద దాడులు చేసి ఎవరైతే వారిని చంపేశారో, ఆ సంఘటనలపై పూర్తి విచారణ జరిపించాలని చంద్రబాబును వారు కోరారు.

ఇవి కూడా చదవండి:

Chandrababu Oath Ceremony: ఈనెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. భారీ ఏర్పాట్లకు సిద్ధమవుతున్న అధిష్ఠానం

AP Politics: రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం త్వరితగతిన పూర్తవ్వాలని శ్రీవారిని కోరా: నటుడు శివాజీ

Viral news: దక్షిణ కజకిస్థాన్‌‌లో బయటపడిన నిధి.. అందులో ఏం ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Updated Date - Jun 07 , 2024 | 02:27 PM

Advertising
Advertising