ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TTD EO: సీఎం చంద్రబాబును కలిసిన టీటీడీ ఈవో

ABN, Publish Date - Sep 22 , 2024 | 12:00 PM

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం మహాశాంతి యాగాని నిర్వహించేందుకు టీటీడీ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన నివాసానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు వచ్చారు.

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబును (CM Chandrababu) కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన నివాసానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో (TTD EO) శ్యామలరావు (Shyamala Rao) వచ్చారు. దేవాలయ సంప్రోక్షణకు సంబంధించిన వివరాలను ఈవో ముఖ్యమంత్రికి వివరించనున్నారు. అలాగే బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు రావాలని ఆహ్వానం అందించనున్నారు. అలాగే ప్రసాదంలో నెయ్యి కల్తీకి సంబంధించిన నివేదికను కూడా శ్యామలరావు చంద్రబాబుకు ఇస్తారు.


కాగా తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం మహాశాంతి యాగాని నిర్వహించేందుకు టీటీడీ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలోని యాగ శాలలో అర్చకులు హోమం నిర్వహించనున్నారు. రేపటి రోజున రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో.. సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి హోమాన్ని నిర్వహించనున్నారు. ముందుగా మహ శాంతి యాగం, వాస్తూ హోమం నిర్వహిస్తారు. చివరిగా పంచగవ్యాలతో సంప్రోక్షణ నిర్వహించనున్నారు. శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్క రోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు.


తిరుమల లడ్డూ (Tirumala Laddu)లో కల్తీ నెయ్యి వాడకంపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం (AP Govt.,) భావిస్తోంది. టీటీడీ ఈవో (TTD EO) ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిశీలిస్తోంది. జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత సంతరించు కోవడంతో కఠినంగా వ్యవహరించాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. కోట్లాది మంది భక్తుల మనో భావాలతో ముడిపడిన అంశం కావడంతో సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలుత సిట్, సీఐడీ, సీబీఐ విచారణల్లో ఏదో ఒకటి చేయించాలని అధికారులు భావించారు. అయితే లడ్డూ వివాదంపై కేంద్రం కూడా సీరియస్‌గా ఉండటంతో సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రోజు రేపటిలోగా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని ప్రభుత్వం కోరనుంది. భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆచీతూచి అడుగులు వేస్తోంది.


పవన్ కల్యాన్ 11 రోజుల పాటు దీక్ష..

మరోవైపు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటంపై ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. కలియుగ ప్రత్యక్షదైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని అన్నారు. ‘‘అమృతతుల్యంగా.. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మలినమైంది. విశృంఖల మనస్కులే ఇలాంటి పాపానికి ఒడికట్టగలరు. లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నుంచి నా మనసు కలత చెందింది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నా దృష్టికి ఈ అంశం రాకపోవడం బాధించింది. బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతిఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. అందులో భాగంగా నేను ‘ప్రాయశ్చిత్త దీక్ష’ చేయాలని సంకల్పించాను. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతా. 11 రోజుల పాటు దీక్ష కొనసాగించిన అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటా. దేవదేవా... నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని వేడుకుంటా భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇలాంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే టీటీడీ బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోడం. కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది. ధర్మాన్ని పునరుద్ధరించే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది. ధర్మో రక్షతి రక్షితః’’ అంటూ పవన్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌పై బీజేపీ నేత ఫైర్.. చర్చకు సిద్ధమా..

జగన్, ధర్మారెడ్డిలను శిక్షించాల్సిందే..

పవన్ కల్యాణ్11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 22 , 2024 | 12:00 PM