ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Varla Ramaiah: జగన్ వైసీపీని ఓ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా నడుపుతున్నాడు

ABN, Publish Date - Jan 09 , 2024 | 07:32 PM

జగన్ వైసీపీని ఓ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా నడుపుతున్నాడని.. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో వ్యవహరిస్తున్న తీరు అలా ఉందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ( Varla Ramaiah ) తెలిపారు.

అమరావతి: జగన్ వైసీపీని ఓ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా నడుపుతున్నాడని.. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో వ్యవహరిస్తున్న తీరు అలా ఉందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ( Varla Ramaiah ) తెలిపారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ జగన్‌కు అధికారం ఇచ్చేందుకు ప్రజలు ఇష్టపడడంలేదని చెప్పారు. ఎమ్మెల్యేలను కాదు.. మార్చాల్సింది జగన్ మార్చాలని ఎద్దేవా చేశారు. 12 మంది దళిత ఎమ్మెల్యేలను బదిలీ చేయడం అవివేకమన్నారు. రాజకీయాల్లో స్థిరపడకుండా చేయడంలో భాగమే ఇదన్నారు. నియోజకవర్గంలో మరోసారి పోటీకి దళితులు సమర్థులు కారా? అని ప్రశ్నించారు. జగన్ మాటలు నమ్మి అత్యుత్సాహంతో ఓట్లు వేసిన.. దళితులను జగన్‌ అడుగడుగునా అవమానిస్తున్నారని మండిపడ్డారు. ‘‘వైసీపీ పార్టీలో ఉండబోం’’ అని ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారని చెప్పారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి చేతులు కట్టుకొని నిలబడితే,.. వేదికపై కుర్చీలల్లో రెడ్లు కూర్చొని దళితులను అవమానించారని వర్ల రామయ్య పేర్కొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 07:32 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising