ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Yarapathineni: టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని వీడియో వైరల్‌.. ఆశ్చర్యపోతున్న వైసీపీ శ్రేణులు

ABN, Publish Date - Jul 06 , 2024 | 09:07 AM

గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రెండు రోజుల క్రితం గురజాల నియోజకవర్గ సమీక్షలో నేతలతో అన్న మాటలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి...

  • నేరం ఎవరు చేసినా చట్టం ఒక్కటే..

  • టీడీపీ వాళ్లు దాడులు చేసినా కేసులు పెట్టండి

  • గురజాల ఎమ్మెల్యే యరపతినేని సంచలన ఆదేశాలు

  • వైసీపీ వాళ్లు ఊర్లు వదిలి వెళ్లొద్దని హితవు

  • వైరల్‌గా మారిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని వీడియో

గుంటూరు/పిడుగురాళ్ల: ‘నాకు ప్రశాంతమైన పల్నాడు కావాలి. వైసీపీ (YSR Congress) ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గం చాలు. మళ్లీ అటువంటి ఉదంతాలు జరగడానికి వీల్లేదు. నేను పోలీసులకు చెప్పేది ఒకటే. టీడీపీ (Telugu Desam) వాళ్లు దాడులకు పాల్పడినా కేసులు పెట్టండి. తప్పు ఎవరిదైతే వారిని శిక్షించండి. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఒకటే చెబుతున్నా.. ఎవ్వరూ ఊర్లు వదిలివెళ్లొద్దు. హాయిగా మీ భార్యాపిల్లలతో కలిసి జీవించండి. మీ వ్యవసాయం, వ్యాపారాలు మీరు చేసుకోండి. మీ పనులు మీరు చక్కదిద్దుకోండి. నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. ఒకవేళ మావాళ్లు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే, మీరే నాకు నేరుగా ఫోన్‌చేయండిఅంటూ గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రెండు రోజుల క్రితం గురజాల నియోజకవర్గ సమీక్షలో నేతలతో అన్న మాటలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


ఆశ్చర్యపోతున్నారు..!

తక్కువ సమయంలో సుమారు కోటిమందికి పైగా ఆ వీడియో వీక్షించడం హాట్‌టాపిక్‌ అయింది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గురజాల నియోజకవర్గం నుండి వేలాది టీడీపీ కుటుంబాలు ఉన్నపాటున ఊర్లు వదిలి వెళ్లిపోయాయి తలదాచుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరిస్థితిని మార్చాలన్న సదుద్దేశంతో ఎమ్మెల్యే యరపతినేని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఊరు విడిచి ఎవరూ వెళ్లొద్దని ప్రత్యర్థి పార్టీ శ్రేణులకు ఆయన ఇచ్చిన భరోసా రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

Updated Date - Jul 06 , 2024 | 09:29 AM

Advertising
Advertising