ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala Laddu Issue: వైసీపీ నేతల్లో వణుకు.. సిట్‫పై దుష్ప్రచారం వెనుక భారీ కుట్ర ఉందా

ABN, Publish Date - Sep 25 , 2024 | 03:32 PM

లడ్డూ వివాదం బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు భిన్న స్వరాలను వినిపిస్తూ వచ్చారు. మొదట కల్తీ జరగలేదని చెప్పిన నేతలు.. ఆ తర్వాత కల్తీ జరిగిన నెయ్యిని ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని చెప్పుకొచ్చారు. ఆ తరువాత కల్తీ జరిగిన నెయ్యిని..

YSRCP

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై వైసీపీ నేతలు చిత్ర విచిత్ర ప్రవర్తనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు లడ్డూ వివాదంపై పారదర్శకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూనే.. మరోవైపు ప్రత్యేక దర్యాప్తు బృందంపై దుష్ప్రచారం చేయడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. మొదట్లో లడ్డూ ప్రసాదం తయారీ కోసం ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరగలేదని బలంగా వాదించిన వైసీపీ నేతలు.. ప్రస్తుతం దర్యాప్తు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. లడ్డూ వివాదం బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు భిన్న స్వరాలను వినిపిస్తూ వచ్చారు. మొదట కల్తీ జరగలేదని చెప్పిన నేతలు.. ఆ తర్వాత కల్తీ జరిగిన నెయ్యిని ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని చెప్పుకొచ్చారు. ఆ తరువాత కల్తీ జరిగిన నెయ్యిని ప్రసాదం తయారీలో ఎందుకు వినియోగించారు.. దీనికి ఈవో బాధ్యత వహించాలంటూ మరో ప్రచారాన్ని తాజాగా ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు ల్యాబ్ నివేదికలు చెబుతున్నాయి. అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన ఈవో నిర్లక్ష్యం కారణంగా నెయ్యిని ప్రసాదం తయారీలో ఉపయోగించి ఉండాలి. అలా జరిగి ఉంటే అప్పటి ఈవోతో పాటు అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని పక్కనపెట్టి టీటీడీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన ప్రస్తుత ఈవోపై వైసీపీ ఆరోపణలు చేయడం వెనుక భారీ కుట్ర ఉందనే చర్చ జరుగుతోంది.

AP Govt: వరద బాధితులకు ప్రభుత్వం అందించిన నష్ట పరిహార వివరాలు ఇవే


ప్రజల దృష్టి మరల్చేందుకేనా..

లడ్డూ వివాదంపై ప్రజల దృష్టి మరల్చేందుకే వైసీపీ రోజుకో వాదనను తెరమీదకు తెస్తుందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో కల్తీ జరిగిందనే విషయం స్పష్టం కావడంతో ఆ పార్టీకి మరక అంటకుండా ఉండేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తిరుమలకు ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిన విషయాన్ని ఎన్ డీబీబీ ‫ ‫నివేదిక స్పష్టం చేసింది. ఆ డెయిరీకి నెయ్యి సరఫరా టెండర్ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే దక్కింది. ఈ అసలు విషయాన్ని పక్కకు నెట్టి మరో కొత్త అంశాన్ని తెరపైకి తేవడం ద్వారా ప్రజల దృష్టిని మరల్చేందుకు వైసీపీ పెద్ద ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ప్రత్యేక దర్యాప్తు బృందంపై ఆరోపణలు చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి

Chandrababu: బోట్ల ఘటన.. కచ్చితంగా వైసీపీ కుట్రే


భయం ఎందుకు..

దర్యాప్తు జరుగుతుండగానే నివేదిక ఓ పార్టీ కార్యాలయంలో తయారైందంటూ వైసీపీ నేతలు విష ప్రచారాన్ని ప్రారంభించారు. ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయాన్ని వదిలేసి, కల్తీకి కారణమైన వ్యక్తులపై చర్యలకు తీసుకోవాలని డిమాండ్ చేయడం మానేసి దర్యాప్తు సంస్థపై తప్పుడు ప్రచారం వెనుక వైసీపీ నేతలు భయపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎలాంటి తప్పు జరగకపోతే, నెయ్యిలో కల్తీ జరగకపోతే దర్యాప్తు సంస్థకు సహకరించడం మానేసి నిందలు వేయడం ఏమిటంటూ ప్రశ్నించేవారు లేకపోలేదు. ఇప్పటికైనా భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న అంశాలపై వైసీపీ రాజకీయం చేయడం మాని దర్యాప్తు అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు.


AP Politics: వైసీపీకి మరో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 25 , 2024 | 03:46 PM