Nara Lokesh: హెచ్‌సీఎల్ భారీ విస్తరణ.. యువతకు మరిన్ని కొలువులు
ABN, Publish Date - Aug 20 , 2024 | 06:23 PM
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం యువత ఉపాధి అవకాశాలపై దృష్టి సారించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను క్రమంగా భర్తీ చేస్తోంది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన కోసం కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ వివిధ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం యువత ఉపాధి అవకాశాలపై దృష్టి సారించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను క్రమంగా భర్తీ చేస్తోంది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన కోసం కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) వివిధ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలో కంపెనీలు నెలకొల్పి, స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాల గురించి మాట్లాడుతున్నారు. ఆ క్రమంలో హెచ్‌సీఎల్ కంపెనీ ముందుకొచ్చింది.
లోకేశ్‌తో భేటీ
ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో మంగళవారం నాడు హెచ్‌సీఎల్ కంపెనీ ప్రతినిధులు సమావేశం అయ్యారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో హెచ్‌సీఎల్ కంపెనీ యూనిట్ రాష్ట్రంలో నెలకొల్పారు. ఆ సమయంలో 4500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఫేజ్-2లో భాగంగా నూతన కార్యాలయ భవనం నిర్మాణం చేపడతామని ప్రకటించారు. కనీసం 10 వేల మందికి ఉద్యోగం కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు మంత్రి నారా లోకేశ్‌కు వివరించారు.
భారీ విస్తరణ
ఆంధ్రప్రదేశ్‌లో హెచ్‌సీఎల్ కంపెనీ భారీ విస్తరణకు ప్రణాళికలు రచించింది. గతంలో 4500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఈ సారి 10 వేల మందికి ఉద్యోగం ఇస్తామని చెబుతోంది. మొత్తం 15 వేల మందికి ఉపాధి కల్పిస్తామని హెచ్‌సీఎల్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందజేయాలని హెచ్‌సీఎల్ కంపెనీ ప్రతినిధులు కోరగా.. అందుకు మంత్రి నారా లోకేశ్ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
TG Bharath: శ్రీవారిని దర్శించుకున్న మంత్రి టీజీ భరత్
YS Jagan: జగన్ కేసులపై విచారణ మరోసారి వాయిదా
Read Latest AP News And Telugu News
Updated Date - Aug 20 , 2024 | 06:23 PM