ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Srisailam: శ్రీశైలానికి భారీగా వరద..

ABN, Publish Date - Oct 25 , 2024 | 05:19 AM

శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద కొనసాగుతోంది. జూరాల నుంచి 70,552 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 1,18,776 క్యూసెక్కులు మొత్తం 1,89,328 నీరు శ్రీశైలానికి వస్తోంది.

  • 4 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల

శ్రీశైలం, మాచర్ల రూరల్‌, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద కొనసాగుతోంది. జూరాల నుంచి 70,552 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 1,18,776 క్యూసెక్కులు మొత్తం 1,89,328 నీరు శ్రీశైలానికి వస్తోంది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులకు చేరింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు శ్రీశైలం డ్యాం 4 గేట్లను 10 అడుగులమేర ఎత్తి 1,12,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


ఏపీ జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 31,276 క్యూసెక్కులు, తెలంగాణ జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 36,600 క్యూసెక్కుల నీటితో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 2,10,149 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 20 గేట్లను ఎత్తి 1,62,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతోపాటు సాగర్‌ కుడి కాలువ ద్వారా 10,350 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 6,173 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 28,826 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400, ఎల్‌ఎల్‌సీ ద్వారా 400 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

Updated Date - Oct 25 , 2024 | 05:19 AM