Share News

రిమాండ్‌ ఖైదీలకు రాచమర్యాదలు చేస్తే చర్యలు

ABN , Publish Date - Dec 01 , 2024 | 05:38 AM

రిమాండ్‌ ఖైదీలకు రాచమర్యాదలు చేసే ఆలోచన ఎవ్వరీకి లేదని, అటువంటి ఘటనలు ఎక్కడైన చోటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.

రిమాండ్‌ ఖైదీలకు రాచమర్యాదలు చేస్తే చర్యలు

  • ఈగల్‌ కోసం ఏటా 9 కోట్లు: హోంమంత్రి అనిత

విజయనగరం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): రిమాండ్‌ ఖైదీలకు రాచమర్యాదలు చేసే ఆలోచన ఎవ్వరీకి లేదని, అటువంటి ఘటనలు ఎక్కడైన చోటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరం డీఆర్‌సీ సమావేశానికి శనివారం హాజరైన ఆమె విలేకరులతో మాట్లాడారు. రిమాండ్‌ ఖైదీలకు రాజభోగాలపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాలపై హోం మంత్రిని వివరణ అడగ్గా... ‘విచారణ జరుగుతోంది. 24 గంటల్లో నివేదిక వస్తుంది. అందులోని అంశాల ఆధారంగా చర్యలు తీసుకుంటాం. ఎంతటి ఉన్నతాధికారులు ఉన్నా చర్యలకు వెనుకాడబోము. గంజాయి సాగు, రవాణాను అరికట్టేందుకు ఈగల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశాం. దీనికోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.9కోట్లు ఖర్చు చేయనుంది. జిల్లాల్లో ఎక్కడైనా బెల్టు షాపులు నిర్వహిస్తే ఉపేక్షించం, కేసులు నమోదు చేస్తాం’ అని హోంమంత్రి అనిత హెచ్చరించారు.

Updated Date - Dec 01 , 2024 | 05:38 AM