Andhra Pradesh Politics : ఆళ్లగడ్డలో ఏ జెండా
ABN, Publish Date - May 12 , 2024 | 04:16 AM
ఫ్యాక్షన్ ప్రభావిత ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి చోటా పార్టీల బలాబలాలపై ఎన్నికలు జరిగితే.. ఇక్కడ మాత్రం వర్గాల మధ్య పోరు నడుస్తుంది
రెండు రాజకీయ కుటుంబాల కీలక పోరు
పట్టు నిలుపుకొనేందుకు వైసీపీ ఎమ్మెల్యే
గంగుల బ్రిజేంద్ర యత్నాలు
ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని
భూమా అఖిలప్రియ పంతం
ఫ్యాక్షన్ ప్రభావిత ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి చోటా పార్టీల బలాబలాలపై ఎన్నికలు జరిగితే.. ఇక్కడ మాత్రం వర్గాల మధ్య పోరు నడుస్తుంది. ఈ నియోజకవర్గంలో భూమా, గంగుల వర్గాల నడుమ మూడు దశాబ్దాలకుపైగా రాజకీయ, వ్యక్తిగత వైరాలు ఉన్నాయి.
రెండు వర్గాలు వేర్వేరు పార్టీల్లో ఉండి బలాబలాలు తేల్చుకోవడం ఆనవాయితీ. 2014 నుంచి ఈ వర్గాల నుంచి కొత్తతరం ఎన్నికల యవనికపైకి వచ్చింది. 2014లో భూమా వర్గం నుంచి అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికై.. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2019లో గంగుల వర్గం నుంచి వచ్చిన బ్రిజేంద్రనాథ్‌రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసి ఆమెపై నెగ్గారు. తాజాగా వీరిద్దరూ మరోసారి తలపడబోతున్నారు.
భూమా కుటుంబానికి టీడీపీ బలం
ఆళ్లగడ్డలో వర్గ పోరు ఉన్నప్పటికీ ఇక్కడ టీడీపీకి పటిష్ఠమైన ఓటు బ్యాంకు ఉంది. భూమా కుటుంబం మొదట టీడీపీతోనే ప్రస్థానం సాగించింది. 1989లో భూమా శేఖరరెడ్డి ఆ పార్టీ తరఫున గెలిచారు. ఆయన మరణానంతరం 1992లో ఆయన తమ్ముడు భూమా నాగిరెడ్డి గెలిచారు.
1997లో భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డి గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు శోభా నాగిరెడ్డి, 2017లో భూమా నాగిరెడ్డిల అకాల మరణంతో వారి రాజకీయ వారసత్వాన్ని అఖిలప్రియ తీసుకున్నారు. 2019లో ఆమె ఓడిపోయినా ప్రజల్లోనే ఉన్నారు. ఆమె తమ్ముడు భూమా విఖ్యాత్‌రెడ్డి భూమా వారసుడిగా అభిమానాన్ని సంపాదించుకున్నారు. జనసేన నాయకుడు ఇరిగెల రాంపుల్లారెడ్డి భూమా కుటుంబంతో కలిసి సాగుతుండడం కీలక పరిణామం.
అరాచకాలు, అక్రమాలతో విసిగిపోయిన ప్రజలు
జగన్ ప్రభుత్వంపైన, ఎమ్మెల్యే బ్రిజేంద్రపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఎమ్మెల్యే అనుయాయులు ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, చెరువుల కబ్జాలతో భారీగా ఆర్జించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి డబ్బులు దండుకున్నారన్న విమర్శలున్నాయి. మూడేళ్లుగా రెండో పంటకు నీరు అందలేదు. నియోజకవర్గంలో ఎవరు గెలవాలన్నా ఆళ్లగడ్డ పట్టణం, శిరివెళ్ల మండలం కీలకం. ఈ మండలంలో మైనారిటీలు ఎక్
- నంద్యాల, ఆంధ్రజ్యోతి
అఖిలప్రియ బలాలు
రాజకీయ కుటుంబ నేపథ్యం.. మంత్రిగా చేసిన అభివృద్ధి.. బలమైన అనుచర వర్గం..
బలహీనతలు
కార్యకర్తలను పట్టించుకోకపోవడం.. కుటుంబ సభ్యులు ప్రచారానికి దూరం.. భూమా కిశోర్‌రెడ్డి వైసీపీలో చేరడం.
బ్రిజేంద్రనాథ్‌రెడ్డి బలాలు..
ఆర్థికంగా పటిష్ఠంగా ఉండడం..
రాజకీయ కుటుంబ నేపథ్యం
బలహీనతలు..
అభివృద్ధి లేకపోవడం.. వైసీపీ నేతల దందాలు,
అక్రమాలు..
వీటిలో కుటుంబ సభ్యుల పాత్ర.. సొంత కుటుంబంలోని వారే
టీడీపీలో చేరడం.
నియోజకవర్గ స్వరూపం..
మండలాలు: శిరివెళ్ల, ఆళ్లగడ్డ, దొర్నిపాడు,
ఉయ్యాలవాడ, చాగలమర్రి, రుద్రవరం
మొత్తం ఓటర్లు: 2,36,676,
పురుషులు: 1,14,955
మహిళలు: 1,17,709,
ట్రాన్స్‌జెండర్లు: 12
కీలక సామాజిక వర్గాల ఓటర్లు..
ముస్లింలు-49 వేలు, రెడ్లు-35 వేలు, ఎస్సీలు-33 వేలు, బలిజలు-28 వేలు, యాదవ-12 వేలు, వాల్మీకి-11 వేలు, కమ్మ-10 వేలు
Updated Date - May 12 , 2024 | 04:16 AM