Andhra Pradesh: సీఎం జగన్ సొంత జిల్లా వైసీపీలో లుకలుకలు..
ABN, Publish Date - Feb 04 , 2024 | 08:53 AM
కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీలో వర్గవిభేదాలు రోజురోజుకు పెరుగిపోతున్నాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డికి
కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీలో వర్గవిభేదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డికి రానున్న శాసనసభ ఎన్నికల్లో టికెట్ ఖరారు చేయవద్దని ఆ పార్టీ అధిష్టానాన్ని ఎమ్మెల్యే అసమ్మతి నాయకులు కోరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యే రాచమల్లుపై స్థానిక అసమ్మతి కౌన్సిలర్లు, వైసీపీ నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. శివప్రసాద్ రెడ్డిపై అసమ్మతి పెరుగుతుండటంతో రాచమల్లుకు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు స్ధానిక అసమ్మతి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
రాచమల్లు రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక అవినీతికి అంతే లేకుండా పోయిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే టికెట్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ పునరాలోచించాలని, రాచమల్లుకు టిక్కెట్టు ఇస్తే సహకరించమని వెల్లడించారు. పార్టీని నమ్ముకుని నిజాయతీగా పని చేస్తున్న నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసి ఎమ్యెల్యే రాచమల్లు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రాచమల్లుకు కాకుండా ఇంకెవరికి టికెట్ ఇచ్చినా భారీ మెజారిటీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 04 , 2024 | 11:05 AM