ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: వెంకయ్య ఇచ్చిన స్ఫూర్తితో రాజకీయాల్లో కొనసాగుతున్నా: సుజనా చౌదరి

ABN, Publish Date - Feb 12 , 2024 | 02:17 PM

మాజీ ఉప రాష్ట్రపతి, సీనియర్ నేత ఎం వెంకయ్య నాయుడు సిద్దాంతాలకు కట్టుబడి ఉంటారని కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి కొనియాడారు. భావి తరాలకు ఉన్నత విలువలు అందించేందుకు కృషి చేశారని వివరించారు.

హైదరాబాద్: మాజీ ఉప రాష్ట్రపతి, సీనియర్ నేత ఎం వెంకయ్య నాయుడు సిద్దాంతాలకు కట్టుబడి పనిచేశారని కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి (Sujana Chowdary) కొనియాడారు. భావి తరాలకు ఉన్నత విలువులు అందించేందుకు కృషి చేశారని వివరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారని సుజనా చౌదరి పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించారని, తాను ఎంచుకున్న సిద్దాంతాలకు అనుగుణంగా పనిచేశారని ప్రశంసించారు.

పోరాడాలని స్ఫూర్తి నింపారు

తర తమ అనే బేధం చూపకుండా వెంకయ్య నాయుడు పనిచేశారని సుజనా చౌదరి వెల్లడించారు. ఉప రాష్ట్రపతి కంటే ముందు బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఎక్కువ కాలం ప్రతిపక్షంలో ఉండి, ప్రజా సమస్యలపై పోరాటం చేశారని వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో ఒక ప్రాంతం నష్టపోతుందని ఆందోళన చెందారని సుజనా చౌదరి వివరించారు. ఒకానొక సమయంలో రాజకీయాలు అంటే తనకు విరక్తి కలిగిందని సుజనా చౌదరి గుర్తుచేశారు. ఇలాంటి సమయంలో పోరాడాలని తనలో స్ఫూర్తి నింపారని గుర్తుచేశారు. ఈ రోజు తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానంటే వెంకయ్య నాయుడు కారణం అని స్పష్టం చేశారు.

వెంకయ్య సూచనలు

వెంకయ్య నాయుడు విలువలతో కూడిన రాజకీయాలు చేశారని మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ అభిప్రాయ పడ్డారు. స్నేహితులకు అండగా నిలిచారని కామినేని శ్రీనివాస్ గుర్తుచేశారు. వెంకయ్య నాయుడుతో తనకు 46 ఏళ్ల స్నేహం ఉందని పేర్కొన్నారు. తాను ఈ స్థాయిలో ఉండేందుకు వెంకయ్య నాయుడు చేసిన సూచనలు పనిచేశాయని వివరించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 12 , 2024 | 02:20 PM

Advertising
Advertising