Education Department : బోధనేతర సిబ్బందితో జేఎల్ పోస్టుల భర్తీ
ABN, Publish Date - Dec 24 , 2024 | 06:48 AM
జూనియర్ లెక్చరర్ల ఖాళీలను ఇంటర్, డిగ్రీ కాలేజీల్లోని బోధనేతర సిబ్బందితో భర్తీ చేసేందుకు ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరం
అమరావతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): జూనియర్ లెక్చరర్ల ఖాళీలను ఇంటర్, డిగ్రీ కాలేజీల్లోని బోధనేతర సిబ్బందితో భర్తీ చేసేందుకు ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 10 శాతం పోస్టులను అర్హత కలిగిన బోధనేతర సిబ్బందితో భర్తీ చేయనున్నట్లు తెలిపింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. గతంలో 40 శాతం టీచర్లకు కోటా ఉండేదని, ఇప్పుడు టీచర్లు లేకుండా కేవలం ఇంటర్, డిగ్రీ కాలేజీల్లోని సిబ్బందితోనే భర్తీ చేస్తున్నారని ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్ అన్నారు.
Updated Date - Dec 24 , 2024 | 06:48 AM