Share News

AP Politics : మంత్రి గుడివాడ అమర్నాథ్ సేఫ్.. టికెట్ ఫిక్స్..!

ABN , Publish Date - Jan 08 , 2024 | 01:54 PM

మంత్రి గుడివాడ అమర్నాథ్‌కి వైసీపీ పెందుర్తి అసెంబ్లీ టికెట్ కేటాయించినట్టు సమాచారం. పార్టీ హైకమాండ్ టికెట్ ఖరారు చేసిందని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం అనకాపల్లి అసెంబ్లీ నుంచి గుడివాడ అమర్నాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

AP Politics : మంత్రి గుడివాడ అమర్నాథ్ సేఫ్.. టికెట్ ఫిక్స్..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర అధికార వైసీపీలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జులను సీఎం వైఎస్ జగన్ రెడ్డి మార్చడంతో రచ్చ రచ్చగా మారింది. మొత్తం రెండు జాబితాలను రిలీజ్ చేయగా.. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు లేకుండా పోయింది. ఈ జాబితాలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఉన్నారు. దీంతో.. అనకాపల్లిలో వైసీపీ కార్యాలయంలో కొత్త నియోజకవర్గ ఇంచార్జీగా మలసాల భరత్ కుమార్ పరిచయ సమావేశంలో మంత్రి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాను అనకాపల్లి నియోజకవర్గం వీడి వెళుతున్నందుకు బాధగా ఉందన్నారు. ఈ క్రమంలో తీవ్ర భావోద్వేగానికి లోనైన గుడివాడ అమర్‌నాథ్ ఎమోషనల్ అయ్యి.. ఏడ్చేశారు. ఇదంతా గతం.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు అమర్నాథ్‌ సేఫ్ జోన్‌లో ఉన్నారట.


Gudiwada-Amarnath.jpg

ఇదీ అసలు కథ..

గుడివాడ అమర్నాథ్‌కు అధిష్టానం పెందుర్తి అసెంబ్లీ టికెట్ కేటాయించినట్టు సమాచారం. పార్టీ హైకమాండ్ టికెట్ ఖరారు చేసిందని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం అనకాపల్లి అసెంబ్లీ నుంచి గుడివాడ అమర్నాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రెండో విడత జాబితాలో మంత్రికి హ్యాండ్ ఇచ్చి అనకాపల్లి ఇన్‌చార్జిగా భరత్ కుమార్‌ను హైకమాండ్ నియమించింది. అధిష్టానం నిర్ణయంతో గుడివాడ అనుచరులు డీలా పడ్డారు. ఇప్పుడు పెందుర్తి టికెట్ తమ నేతకే వస్తుందని గుడివాడ వర్గీయులు చెబుతున్నారు. అయితే.. దీనిపై ఇంతవరకూ అటు హైకమాండ్ నుంచి గానీ.. ఇటు అమర్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. అభిమానులు, వైసీపీ కార్యకర్తలు మాత్రం అమర్ సేఫ్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎమోషనల్ డ్రామా గట్టిగానే పండిందని.. ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు నెట్టింట్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Updated Date - Jan 08 , 2024 | 02:30 PM