CM Jagan: బస్సు యాత్రకు జనాన్ని తరలించాలంటూ ఆదేశాలు.. వైసీపీ నేతలేం చెప్పారంటే..
ABN, Publish Date - Mar 25 , 2024 | 09:57 AM
ఎల్లుండి 27 న ఇడుపులపాయ నుంచి సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ప్రొద్దుటూరులో జరగబోయే జగన్ బస్సుయాత్ర సిద్దం సభకు భారీగా జనాన్ని తరలించాలని నాయకులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. నాయకుల మధ్య సఖ్యత కుదరక మీరు చెప్పినంత మందిని తరలించలేమని నాయకులు తేల్చి చెప్పినట్లు సమాచారం.
కడప : ఎల్లుండి 27 న ఇడుపులపాయ నుంచి సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి (CM Jagan) బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ప్రొద్దుటూరులో జరగబోయే జగన్ బస్సుయాత్ర సిద్దం సభకు భారీగా జనాన్ని తరలించాలని నాయకులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. నాయకుల మధ్య సఖ్యత కుదరక మీరు చెప్పినంత మందిని తరలించలేమని నాయకులు తేల్చి చెప్పినట్లు సమాచారం.
Crime.. కృష్ణాజిల్లా: అవనిగడ్డలో యువకునిపై కత్తితో దాడి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) ఈనెల 27 నుంచి బస్సుయాత్ర ప్రారంభించనున్నారు. సిద్దం (Siddam) పేరుతో రాష్ట్రంలో నాలుగు చోట్ల సభలు నిర్వహించిన జగన్ ఇప్పుడు బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. సిద్ధం సభలు జరిగిన పార్లమెంటు నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారు. నోటిఫికేషన్ (Election Notification) వచ్చే నాటికి బస్సు యాత్ర అంటే ఏప్రిల్ 18 నాటికి బస్సుయాత్ర ముగియనుంది. 27 ఉదయం ఇడుపులపాయలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) సమాధి వద్ద నివాళి చేసి జగన్ యాత్రకు సిద్ధమవనున్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రి హోదాలో పరదాలు, బారికేడ్ల మధ్య తిరిగిన జగన్మోహన్‌రెడ్డి... ఎన్నికల ముందు జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
‘మేమంతా సిద్ధం’ పేరిట ఈ నెల 26 లేదా 27వ తేదీ నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. దాదాపు నెలరోజుల పాటు ఈ యాత్ర జరగనుంది. పులివెందుల నుంచి ఇచ్ఛాపురం వరకూ బస్సు యాత్రకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు. ఉదయం పూట అభ్యర్థులు, జిల్లా ముఖ్యనేతలతోనూ ఎన్నికల వ్యూహాలపై సమీక్షిస్తారు. సాయంత్రం బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఈ ఐదేళ్లలో జగన్ ఎక్కడికి వెళ్లినా అక్కడ కర్ఫ్యూ వాతావరణం సృష్టించారు. వందలకొద్దీ పోలీసుల బందోబస్తు మధ్య పరదాల మాటునే జగన్ తిరిగిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు దీర్ఘకాలం ఉండడం వైసీపీకి కలిసొచ్చిన అంశంగా జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Narayana: ఆనాటి కష్టాలను ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్నారు..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 25 , 2024 | 09:57 AM