ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jagan's Regime : బడులను ముంచేసిన జగన్‌

ABN, Publish Date - Dec 11 , 2024 | 04:44 AM

జగన్‌ ప్రభుత్వ నిర్వాకంతో ప్రాథమిక పాఠశాలలు నిండా మునిగాయి. రాష్ట్రంలో 20 మంది పిల్లలు కూడా లేని పాఠశాలలు 13,676కు పెరిగాయి.

  • 13,676 ప్రభుత్వ స్కూళ్లలో 20 మందిలోపే విద్యార్థులు

  • ఏకోపాధ్యాయ బడులు 12,105.. తాజా నివేదికలో సర్కారు వెల్లడి

అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వ నిర్వాకంతో ప్రాథమిక పాఠశాలలు నిండా మునిగాయి. రాష్ట్రంలో 20 మంది పిల్లలు కూడా లేని పాఠశాలలు 13,676కు పెరిగాయి. కేవలం ఒక్కరే టీచర్‌తో నెట్టుకొస్తున్న పాఠశాలలు 12,105 ఉన్నాయి. ప్రభుత్వం కలెక్టర్ల సదస్సు కోసం రూపొందించిన నివేదికలో ఈ అంశాలను పేర్కొంది. ప్రాథమిక స్థాయిలో అభ్యసన ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపింది. దీనిని అధిగమించేందుకు ‘ఆదర్శ పాఠశాల’ విధానం తీసుకొచ్చే ప్రతిపాదన చేసింది. మౌలిక సదుపాయాల్లో 87 స్కూళ్లు జీరో స్టార్‌ రేటింగ్‌తో అత్యంత దయనీయంగా ఉన్నాయని, అకడమిక్‌ రేటింగ్‌లో 311 పాఠశాలలు జీరో రేటింగ్‌లో మిగిలిపోయాయని నివేదికలో పేర్కొంది.

  • రూ.6 కోట్ల పునరావాస ప్యాకేజీ హాంఫట్‌

  • గిరిజనుల సొమ్ము కొట్టేసిన వైసీపీ నేతలు... టీడీపీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

భూఆక్రమణలు, నకిలీ డాక్యుమెంట్లతో తప్పుడు రిజిస్ర్టేషన్లపై టీడీపీ ప్రజావేదికలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, అమూడా చైర్మన్‌ స్వామినాయుడు అర్జీలు స్వీకరించారు. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం చినరమణయ్యపేట, దండంగి, కె.వీరవరం గ్రామాల్లో వైసీపీ నేతలు ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి, రూ.6కోట్లుపైగా పునరావాస ప్యాకేజీని కొట్టేశారని దీనిపై విచారణ జరపాలని చినరమణయ్యపేటకు చెందిన మెహర్‌బాబుగౌడ్‌ విజ్ఞప్తి చేశారు.. కృష్ణా జిల్లా పాపవినాశనంలో గతంలో ఇళ్ల స్థలాలకు పట్టాలిచ్చినా.. స్థలాలు చూపించడం లేదని ఎస్సీ, ఎస్టీల పేదలు వాపోయారు. 40ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమించి.. సుభాన్‌ అనే వ్యక్తి క్రషర్‌ ఫ్యాక్టరీ పెట్టాడని కర్నూలు జిల్లా మాచాపురానికి చెందిన దానమ్మ ఫిర్యాదు చేశారు. వైద్యారోగ్యశాఖలో ఎంపీహెచ్‌ఏలను తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కాంట్రాక్ట్‌ ఎంపీహెచ్‌ఏలు కోరారు. ఈ సమస్యలపై మంత్రి తక్షణమే స్పందించి.. సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి పరిష్కారానికి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Dec 11 , 2024 | 06:11 AM