ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jagan's Regime : చేసింది సున్నా.. నొక్కింది 165 కోట్లు!

ABN, Publish Date - Nov 27 , 2024 | 05:26 AM

మాజీ సీఎం జగన్‌ సొంత జిల్లా కడప. ఐదేళ్లు ఆయన అధికారంలో ఉండడంతో ఈ జిల్లా అభివృద్ధిలో పరుగులు పెట్టి ఉంటుందనేది... ఇతర జిల్లా వాసులు భావన..! కానీ.. సొంత జిల్లా అభివృద్ధికి జగన్‌ చేసింది అంతంతమాత్రమే.

  • జగన్‌ హయాంలో కడప ఎయిర్‌పోర్టుకు చేసింది శూన్యం

  • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే పునరుద్ధరణ

(కడప-ఆంధ్రజ్యోతి)

మాజీ సీఎం జగన్‌ సొంత జిల్లా కడప. ఐదేళ్లు ఆయన అధికారంలో ఉండడంతో ఈ జిల్లా అభివృద్ధిలో పరుగులు పెట్టి ఉంటుందనేది... ఇతర జిల్లా వాసులు భావన..! కానీ.. సొంత జిల్లా అభివృద్ధికి జగన్‌ చేసింది అంతంతమాత్రమే. ఆయన అధికారంలో ఉండగా జిల్లాకో విమానాశ్రయాన్ని తీసుకొస్తానని ఊదరగొట్టారు. కానీ.. సొంత జిల్లాలో విమానాశ్రయాన్నే పట్టించుకోలేదు. పైగా.. ఎన్నికలకు ఏడాది ముందు కడప విమానాశ్రయం అభివృద్ధి పేరుతో రూ.165 కోట్లు మాయం చేయడం, దీనిపైౖ మంగళవారం ‘ఆంధ్రజ్యో తి’ ప్రధాన సంచికలో కథనం రావడంతో జిల్లాలో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది. కడప ఎయిర్‌పోర్టుకు చేసింది సున్నా.. కొట్టేసింది మాత్రం రూ.165 కోట్లా? అంటూ జనం ఆశ్చర్యం వక్తం చేస్తున్నారు. వాస్తవానికి కడప-హైదరాబాద్‌ విమాన సర్వీసు ఏడాదిపాటు నిలిచిపోయినా ఆయన పట్టించుకోలేదు. చివరికి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవలే ఆ సర్వీసును పునరుద్ధరించారు. పస్తుతం ఎయిర్‌పోర్టు అఽథారిటీ ఆధ్వర్యంలో కేంద్రం నిధులతో కొత్తగా టెర్మినల్‌ నిర్మాణం చేపడుతున్నారు. విమానాశ్రయ భూసేకరణ కు సంబంధించి వైసీపీ ప్రభుత్వం రైతులకు రూ.70 కోట్లు చెల్లించింది. ఇది తప్ప ఒక్క పనీ చేపట్టలేదు.


  • టీడీపీ ప్రభుత్వంలోనే మహర్దశ

కడప విమానాశ్రయం టీడీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధికి నోచుకుంది. విభజిత రాష్ట్రానికి మొదటిసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. 2015 జూన్‌ 7న అప్పటి కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు దీన్ని ప్రారంభించారు. అప్పట్లో ఎయిర్‌ పెగాస్‌.. కడప-బెంగళూరు మధ్య వారానికి 3సార్లు సర్వీసు నడిపేది. అనంతరం అవి రద్దయ్యాయి. ప్రాంతీయ కనెక్టివిటీని పెం చేందుకు 2017లో ఉడాన్‌ స్కీంను ప్రారంభించారు. దీంతో కడప నుంచి ట్రూజెట్‌.. కడప-హైదరాబాద్‌, కడప-విజయవాడ, కడప-చెన్నై, కడప-బెల్గాం సర్వీసులు నడిపింది. ట్రూ జెట్‌ తన సర్వీసులు నిలిపివేసిన తర్వాత ఇండిగో సర్వీసులు నడిచేవి. 2023 నవంబరులో ఇండిగో కూడా కడప-హైదారబాద్‌ సర్వీసును నిలిపివేసింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ గత నెల 27 నుంచి కడప-హైదరాబాద్‌ మధ్య ఇండిగో సర్వీసులు కొనసాగిస్తోంది. ప్రస్తుతం కడప-హైదరాబాద్‌, కడప-చెన్నై, కడప-విజయవాడ మధ్య సర్వీసులు ఉన్నాయి. రోజూ సగటున 200 మంది రాకపోకలు సాగిస్తున్నారు.

Updated Date - Nov 27 , 2024 | 05:26 AM