ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu : పోలవరం విధ్వంసంపై జవాబేది జగన్‌?

ABN, Publish Date - Jun 30 , 2024 | 05:40 AM

పోలవరం ప్రాజెక్టు విధ్వంసంపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై జగన్‌ సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తున్నారు. పోలవరం ప్రస్తుత దుస్థితికి కర్త, కర్మ, క్రియ జగనేనని చంద్రబాబు విస్పష్టంగా ప్రకటించారు.

  • శ్వేతపత్రం విడుదలై 24గంటలు దాటినా మౌనమే

  • ప్రాజెక్టు అర్థం కాలేదన్న అంబటితో వ్యాఖ్యలా?

  • విపక్ష నేత హోదా కోరేటప్పుడు దీనిపై స్పందించక్కర్లేదా?

  • నిలదీస్తున్న సాగునీటి నిపుణులు

అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు విధ్వంసంపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై జగన్‌ సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తున్నారు. పోలవరం ప్రస్తుత దుస్థితికి కర్త, కర్మ, క్రియ జగనేనని చంద్రబాబు విస్పష్టంగా ప్రకటించారు. అయినా, దీనిపై జగన్‌ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని రుచిచూశాక.. జనానికి దూరంగా జగన్‌, పులివెందుల, బెంగళూరు ప్యాలె్‌సల్లో గడుపుతున్నారు.

వాస్తవానికి ఐదేళ్ల వైసీపీ పాలనలో పోలవరంపై రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు. పోలవరం ప్రాజెక్టును 2025 నాటికి పూర్తిచేస్తామని 2024 ఎన్నికల సమయంలో ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో చంద్రబాబు పోలవరంపై శ్వేత పత్రాన్ని విడుదల చేస్తూ, జగన్‌ మోసపు మాటలను జనం ముందుంచారు. తనకు పోలవరం ప్రాజెక్టు అర్థంకాలేదన్న అప్పటి సాగునీటి మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలనూ చంద్రబాబు గుర్తుచేశారు. దీనిపై రాంబాబు శనివారం స్పందించారు. పోలవరం ఇప్పట్లో పూర్తికాదన్న తన వాదనను పునరుద్ఘాటించారు. అయితే.. ఇంత సున్నితమైన పోలవరం ప్రాజెక్టపై జగన్‌ మౌనం దాల్చి ముఖం చాటేయడంపై రాష్ట్ర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రతిపక్ష నేత హోదా కోరుకుంటున్న జగన్‌ పోలవరం వంటి అతి ముఖ్యమైన అంశంపైనా నోరు విప్పకపోతే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Jun 30 , 2024 | 05:40 AM

Advertising
Advertising