Pawankalyan: ప్రతి స్త్రీమూర్తికీ మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:52 PM
Andhrapradesh: ‘‘నవతరం యువత తరచూ మల్టీ టాస్కింగ్ అంటూ ఉంటుంది... మన ఇంట్లో అమ్మ, అక్క, చెల్లినే కాదు.. ఏ మహిళామణిని చూసినా మల్టీ టాస్కింగ్ అంటే ఏమిటో తెలుస్తుంది’’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా పవన్.. ప్రతి స్త్రీమూర్తికీ మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, మార్చి 8: ‘‘నవతరం యువత తరచూ మల్టీ టాస్కింగ్ అంటూ ఉంటుంది... మన ఇంట్లో అమ్మ, అక్క, చెల్లినే కాదు.. ఏ మహిళామణిని చూసినా మల్టీ టాస్కింగ్ అంటే ఏమిటో తెలుస్తుంది’’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. మహిళా దినోత్సవం (Womens Day) సందర్భంగా పవన్.. ప్రతి స్త్రీమూర్తికీ మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇంటిని చక్కదిద్దుతూ, బిడ్డల ఆలనాపాలన చూస్తూనే- ఉద్యోగ విధుల్లో, తాము ఎంచుకున్న రంగాల్లో రాణిస్తున్న అతివలు ఎందరో అని.. వారి స్ఫూర్తితో ముందడుగు వేస్తున్న ఈతరం ఆడబిడ్డలు మరెందరో అని అన్నారు. ఆకాశమే హద్దుగా దూసుకువెళ్లగల సత్తా వీరి సొంతమన్నారు. వీరికి మనం అందించాల్సింది ప్రోత్సాహం మాత్రమే అని చెప్పుకొచ్చారు.
Palle Raghunath Reddy: ఒక్కరాజధాని కట్టలేని దద్దమ్మ.. 3 రాజధానులు కడతానంటే నమ్ముతారా?
విద్య, ఉద్యోగాల్లో రాణించేలా చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించేలా చేస్తామన్నారు. ‘‘నా అక్కలు నా చెల్లెమ్మలు.. అని నాలుక చివరి మాటలతో సరిపుచ్చము. ప్రతి ఆడపడుచుకీ రక్షణ ఇవ్వడం, వారి సంక్షేమానికి కట్టుబడి ఉండటం. రాబోతున్న మా ఉమ్మడి ప్రభుత్వం బాధ్యత అని తెలియచేస్తున్నాను’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
BJP: బీజేపీ పెద్ద స్కెచే వేసిందిగా..? బెంగాల్ లోక్ సభ నుంచి బరిలోకి ఆ క్రికెటర్..!!
Telangana: ఓరి బాబోయ్.. ఇలాంటోళ్లతో జాగ్రత్త.. నట్టేట ముంచేస్తారు!
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...