ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyan: ఏపీలో కాలువల నిర్వహణపై పవన్ కామెంట్స్

ABN, Publish Date - May 14 , 2024 | 11:16 AM

Andhrapradesh: ఏపీలో యుద్ధ ప్రాతిపదికన కాలువలకు మరమ్మతులు చేపట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాలువల నిర్వహణ పనులపై గత అయిదేళ్లుగా దృష్టిపెట్టలేదని విమర్శించారు. సాగు నీటి అవసరాలు తీర్చే కాలువలు, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు వేసవి సమయంలో చేపట్టాలన్నారు.

Janasena Chief Pawan kalyan

అమరావతి, మే 14: ఏపీలో (Andhrapradesh) యుద్ధ ప్రాతిపదికన కాలువలకు మరమ్మతులు చేపట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాలువల నిర్వహణ పనులపై గత అయిదేళ్లుగా దృష్టిపెట్టలేదని విమర్శించారు. సాగు నీటి అవసరాలు తీర్చే కాలువలు, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు వేసవి సమయంలో చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ముగిసిన తరుణంలో మధ్యంతర ప్రభుత్వం ఈ అంశంపై జల వనరుల శాఖతో సమీక్షించాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు కాలువలకు సంబంధించిన నిర్వహణ పనులపై దృష్టి సారించాలని జనసేనాని తెలిపారు.

PM Modi: క్రూజ్‌లో నమో ఘాట్‌కు మోదీ


రాష్ట్రంలో ఏ పంట కాలువ చూసినా పూడిక చేరిపోయి, తుప్పలు, తూటి కాడలు పెరిగిపోయి ఉన్నాయన్నారు. కాలువలకు నీరు వదిలినా ప్రవాహం ముందుకు వెళ్ళే పరిస్థితి లేదన్నారు. చివరి ఆయకట్టుకు నీరు అందటం లేదన్నారు. గత యేడాది పశ్చిమ కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోవడానికి కాలువల నిర్వహణ సరిగా లేకపోవడమే కారణమన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా రైతాంగం నుంచి ఈ సమస్యపైనే ఎక్కువ విజ్ఞాపనలు వచ్చాయని తెలిపారు. జలవనరుల శాఖ యుద్ధ ప్రాతిపదికన కాలువలకు, లాకులకు మరమ్మతులు ఈ వేసవి ముగిసేలోగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రుతు పవనాలు ప్రవేశించేలోగా పనులు పూర్తయితేనే రైతాంగానికి మేలు జరుగుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.


ఇవి కూడా చదవండి...

YCP Mla: పోలింగ్ కేంద్రంలో రూల్స్ బ్రేక్.. ఏం చేశారంటే..?

Fake News: ఏబీఎన్ పేరుతో వైసీపీ సర్వే ఫేక్ వీడియో..

Read Latest AP News And Telugu News

Updated Date - May 14 , 2024 | 11:19 AM

Advertising
Advertising