ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Good News: అభ్యర్థులూ గెట్ రెడీ.. నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయ్..

ABN, Publish Date - Jun 14 , 2024 | 11:13 AM

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇన్నాళ్లూ నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాసేలా చూసిన వారికి సీఎం చంద్రబాబు అధికారం చేపడుతూనే అభ్యర్థుల కళ్లలో ఆనందం నింపారు. తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ పైనే పెట్టారు. ఇక ఇంతటితో అయిపోలేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు సైతం వెలువడేందుకు సమయం ఆసన్నమైంది.

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇన్నాళ్లూ నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాసేలా చూసిన వారికి సీఎం చంద్రబాబు అధికారం చేపడుతూనే అభ్యర్థుల కళ్లలో ఆనందం నింపారు. తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ పైనే పెట్టారు. ఇక ఇంతటితో అయిపోలేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు సైతం వెలువడేందుకు సమయం ఆసన్నమైంది. తన హయాంలో వీలైనన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేలా సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.తొలుత విద్యా శాఖలో మరిన్ని పోస్టులను భర్తీ చేసే దిశగా చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తోంది. మెగా డీఎస్సీతో పాటు.. మరో 8168 ఖాళీలను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.


నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా భర్తీ చేసే అవకాశంపై ఏపీ సీఎం ఆరా తీశారని సమాచారం. కేజీబీవీల్లో 4594 కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా భర్తీ చేయొచ్చని అధికారుల వెల్లడించారు. 612 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులను ప్రభుత్వం అదనంగా సృష్టించనుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ప్రకారం 2962 ఎస్జీటీ పోస్టులను సృష్టించవచ్చన్న విద్యా శాఖ అధికారులు సీఎంకు తెలిపారట. గత ప్రభుత్వం 600కు పైగా ఎస్జీటీ పోస్టులను రద్దు చేసిందని వివరించారు. తమ శాఖలో ఇంకా 8168 ఖాళీలను రిక్రూట్ చేసే అవకాశం ఉందని విద్యా శాఖ అధికారుల వెల్లడించారు. ఆ ఖాళీల భర్తీ ప్రక్రియను కూడా చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. విద్యా శాఖ తరహాలోనే మిగిలిన శాఖల్లోనూ పోస్టుల భర్తీ చేయాలనే యోచనలో ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు.

Updated Date - Jun 14 , 2024 | 11:32 AM

Advertising
Advertising