ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Pensions: పెన్షన్ల పంపిణీలో చేతివాటం.. రూ. 200 కోత

ABN, Publish Date - Jul 02 , 2024 | 09:14 AM

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ల పంపిణీలో కొందరు చేతివాటం చూపించారు..

అన్నమయ్య జిల్లా/పుల్లంపేట: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ల (AP Pensions) పంపిణీలో కొందరు సచివాలయ ఉద్యోగులు చేతివాటం చూపించారు. రూ.200 సచివాలయ సిబ్బంది తీసుకుని మిగిలిన మొత్తాన్ని పెన్షనర్లకు అందచేశారు. పుల్లంపేట మండలంలోని టి.కమ్మపల్లె పంచాయతీ కృష్ణంపల్లెలో సచివాలయ సిబ్బంది వలంటీర్‌తో కలిసి పెన్షన్‌లు పంపిణీ చేసి చేతివాటం ప్రదర్శించారు. ఈ గ్రామంలో సుమారు 40కి పైగా వివిధ రకాల పెన్షన్‌ లబ్ధిదారులు ఉన్నారు. సచివాలయ సిబ్బంది, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ఫణిక్రిష్ణ, డిజిటల్‌ అసిస్టెంట్‌ మహేశ్‌లు గతంలో పనిచేసిన వలంటీర్‌ సురేష్‌ను వెంటబెట్టుకుని పెన్షన్‌ పంపిణీ చేశారు.

ఏపీలో ఆగిన పెన్షన్ల పంపిణీ..



జీతాల్లేవని..!

తనకు జగన్‌ ప్రభుత్వం జీతాలు సక్రమంగా ఇవ్వలేదని ఒక్కో పెన్షన్‌ లబ్ధిదారుడి నుంచి 200 రూపాయల చొప్పున వసూలు చేశారు. ఈ విషయాన్ని కూటమి నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శి రామసుబ్బయ్య పెన్షన్‌దారులకు 200 రూపాయలను మధ్యాహ్నం తిరిగి ఇచ్చేశారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని, చెబితే పెన్షన్‌ ఆగిపోతుందని భయపెట్టినట్లు తెలిసింది.


అయినా... మార్పు రాలేదు!

గతంలో కూడా సచివాలయ సిబ్బంది వివిధ ప్రభుత్వ పథకాల్లో అనర్హులకు చోటు కల్పించి సగం సగం వాటాలు పంచుకున్నట్లు ఉన్నతాధికారులకు గ్రామస్థులు పక్కా ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అంతేగాకుండా డైరెక్టుగా సచివాలయ సిబ్బంది ఫోన్‌పే ద్వారా డబ్బులు కూడా తీసుకున్నట్లు గ్రామస్థులు ఆధారాలతో బయటపెట్టారు. ఉన్నతాధికారులు విచారించినా స్థానిక వైసీపీ నాయకుల పలుకుబడితో అప్పట్లో బయటపడ్డారు. అయినా వారిలో మార్పు రాలేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించడంపై కూటమి నాయకులు భగ్గుమంటున్నారు. పెన్షన్‌ పంపిణీలో చేతివాటం ప్రదర్శించడంపై ఎంపీడీవో నరసింహమూర్తిని వివరణ కోరగా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Jul 02 , 2024 | 09:20 AM

Advertising
Advertising