AP Government: ఉపాధి కోసం విదేశానికి వెళ్లి నరకయాతన.. వెంటనే స్పందించిన ఏపీ ప్రభుత్వం..
ABN, Publish Date - Sep 14 , 2024 | 09:25 AM
ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లి మోసపోతున్న ఘటనలు ఇటీవల ఎక్కువుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కువైట్, దుబాయి వెళ్లి మోసపోతున్నారు. ఇలాంటి సంఘటనల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి..
ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లి మోసపోతున్న ఘటనలు ఇటీవల ఎక్కువుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కువైట్, దుబాయి వెళ్లి మోసపోతున్నారు. ఇలాంటి సంఘటనల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తుంది. తాజాగా అన్నమయ్య జిల్లాకు చెందిన కవితను ఉపాధి కోసం కువైట్ వెళ్లిందిం. అక్కడ ఇబ్బందులు పడుతుండటంతో ఆమె పరిస్థితిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే స్పందించిన ఏపీ ప్రభుత్వం కువైట్ నుంచి కవితను స్వదేశానికి క్షేమంగా తీసుకొచ్చింది. గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తునవారిలో కొందరు ఏజెంట్ల చేతిలో మోసపోతుండగా.. మరికొందరు పని ప్రదేశంలో ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి పేరుతో గల్ఫ్ దేశాలు తీసుకెళ్లి.. అక్కడికి వెళ్లిన తర్వాత పని ఇప్పించకపోవడం, లేదా ఎవరూ చేయలేని అతికష్టమైన పనులను అప్పగిస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినా అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ఏర్పడిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి చెందినవారి సమస్యలపట్ల తక్షణమే స్పందించి వారికి తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా కవితను స్వదేశానికి తీసుకొచ్చింది.
ఉపాధి కోసం..
అన్నమయ్య జిల్లా తంబేపల్లి మండలం నారాయణ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన తిరుపతి కవిత ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. పని ప్రదేశంలో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి వచ్చింది. దీంతో ఆమెను రాష్ట్రానికి తీసుకురావాలని ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను రాంప్రసాద్ రెడ్డి కోరారు. దీంతో ఏపీ ఎన్నార్టీ 24 గంటల హెల్ప్ లైన్ ద్వారా కువైట్ లో ఉన్న సామాజిక కార్యకర్త జిలకర మురళి, షేక్ రసీదా బేగం సహాయ సహకారాలతో కవిత ఆమె స్వగ్రామానికి చేరుకుంది.
ఎయిర్ ఇండియా విమానంలో..
కువైట్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్‌లో శనివారం ఉదయం 7 గంటలకు చెన్నై ఎయిర్ పోర్టుకు చేరుకోగా.. అక్కడి నుంచి నారాయణరెడ్డి పల్లి చేరుకుంది. ఉపాధి కోసం కువైట్ వెళ్లిన కవిత పని ప్రదేశంలో అనేక ఇబ్బందులకు గురైనట్లు వీడియో ద్వారా వెల్లడించింది. ఆమెకు ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా దగ్గరలో ఉన్న తన సోదరి వద్ద తాత్కాలిక ఆశ్రయం పొందింది. వీడియో సందేశాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి పంపించగా.. ఆయన తక్షణమే స్పందించి బాధితురాలి వివరాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ఇచ్చారు. కవితను స్వస్థలానికి సురక్షితంగా తీసుకురావాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి లేఖ రాశారు. శుక్రవారం ఉదయం మంత్రి కార్యాలయానికి సమాచారం అందిన వెంటనే తక్షణం స్పందించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఏపీ ఎన్నార్టీ అత్యవసర విభాగాన్ని అప్రమత్తం చేశారు. మంత్రి ఆదేశాలతో వెంటనే స్పందించిన ఏపీ ఎన్నార్టీ 24 గంటల అత్యవసర విభాగం 12 గంటల్లోపే స్పందించి ఆమెను స్వదేశానికి తీసుకొచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News
Updated Date - Sep 14 , 2024 | 09:35 AM