Pawan Kalyan: వారిని ఎలా నియంత్రించాలో తెలుసు.. చేసి చూపిస్తాం
ABN, Publish Date - Dec 28 , 2024 | 01:39 PM
Pawan Kalyan: వైసీపీ దాడిలో గాయపడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఇష్టారాజ్యంగా అధికారులపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా పవన్ అన్నారు. ఘటనా స్థలానికి సీఐ వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్ కాలేదన్నారు.
కడప, డిసెంబర్ 28: రిమ్స్‌లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) పరామర్శించారు. కాసేపటి క్రితమే రిమ్స్‌కు చేరుకున్న డిప్యూటీసీ సీఎం.. ఎంపీడీవోను పరామర్శించి వైసీపీ నేతల దాడికి సంబంధించి బాధితుడిని, కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుడు ఎంపీడీఓ జవహర్ బాబుకు, కుటుంబసభ్యులకు ‘‘ నేనున్నాను.. ధైర్యంగా ఉండమని’’ పవన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఉపముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాదన్నారు. ఇది వైసీపీ రాజ్యం అనుకుంటున్నారని మండిపడ్డారు. ఎంపీడీఓ జవహర్ బాబును అమానుషంగా కొట్టారని.. జవహర్ బాబుకు హైబీపీతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నారు. ఎవరి మీదైనా దాడి చేస్తే గత ప్రభుత్వంలా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇష్టారాజ్యంగా అధికారులపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఘటనా స్థలానికి సీఐ వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్ కాలేదన్నారు. అహంకారంతో దాడి చేస్తే తోలు తీసి కూర్చోపెడతామని హెచ్చరించారు. వైసీపీ నేతలకు అహంకారంతో కళ్ళు నెత్తికెక్కాయన్నారు. ఇది కూటమి ప్రభుత్వం.. వైసీపీ కాదని గుర్తుపెట్టుకోవాలన్నారు. ‘‘మాకు మిమ్మల్నిఎలా నియంత్రించాలో తెలుసు.. చేసి చూపిస్తాం’’ అని స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ అని కాదు ఎవరైనా సరే ఆధిపత్యధోరణిలో ఎవరి మీద చేసినా ఇలాగే స్పందిస్తామన్నారు. పరారిలో ఉన్నవారి కోసం పోలీసులు గాలిస్తున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు.
కులం పేరుతో దూషణలా..
రాయలసీమలో మహిళలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీకి 11 సీట్లు వచ్చినా వారి అహంకారం తగ్గలేదన్నారు. కూటమి నాయకులు కూడా దైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. జవహర్ బాబును భయపెట్టి చంపుతాం అని బెదిరించారని.. ఇలాంటి నాయకులు ఎన్నికల్లో పాల్గొనాలి అంటే భయం రావాలన్నారు. జవహర్ బాబు కుటుంబానికి భరోసా ఇస్తున్నామన్నారు. ఒక మండలానికి అధికారిని కులం పేరుతో దూషించడం పరిపాటి అయిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. పులివెందుల ప్రాంతంలో ఒక రైతుకుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని.. రైతు కుటుంబం ఆత్మహత్యపై విచారణ జరుగుతోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కాగా.. ఈరోజు ఉదయం గన్నవరం నుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్న పవన్‌కు జిల్లా అధికారులు స్వాగతం పలికారు. కడప విమానాశ్రయం నుంచి రిమ్స్‌కు వెళ్లి.. గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పవన్ కళ్యాణ్ పరామర్శించారు.
ఈ పొలిటికల్ స్టార్‌కు బాగా కలిసొచ్చిన కాలం
ఫోన్‌లో హోంమంత్రి పరామర్శ
అమరావతి: గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును హోంమంత్రి అనిత ఫోన్‌లో పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై దాడి చేయడంపట్ల హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడితో మాట్లాడి దాడి ఘటనపై ఆరా తీశారు. దౌర్జన్యాలు, రౌడీ చర్యలకు పాల్పడితే రౌడీ షీట్లు తెరుస్తామని హెచ్చరించారు. అధికారులు, సామాన్యులపై వైసీపీ నాయకుల దాడి.. వారి ఆధిపత్యం, అహంకారానికి నిదర్శనమని ఈ సందర్భంగా హోంమంత్రి అనిత వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
ఈ పొలిటికల్ స్టార్‌కు బాగా కలిసొచ్చిన కాలం
బియ్యం మాయం కేసులో అనుమానాలెన్నో..
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 28 , 2024 | 01:51 PM