ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP NEWS: అబ్బుర పరుస్తున్న బృహత్ శిలాయుగం నాటి ఆనవాళ్లు

ABN, Publish Date - Nov 24 , 2024 | 07:52 AM

అన్నమయ్య జిల్లాకు ఎంతో ప్రాచీన చరిత్ర, సంస్కృతి ఉన్నాయనడానికి ఈ రాతి నిర్మాణాలే నిదర్శనం. దేవవాండ్లప ల్లెకు ఉత్తర దిశలో దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోని శేషాచల కొండల్లోని ఎర్రకొండల్లో ఈ నిర్మాణాలు ఉన్నాయి.

  • శేషాచలంలో ప్రాచీన మానవ జీవనానికి సాక్ష్యాలు

  • అన్నమయ్య జిల్లాలో బృహత్ శిలాయుగం నాటి సమాధులు

  • 1914లోనే వీటిని గుర్తించిన ఆంగ్లేయుడు రాబర్ట్ పూటే

  • పాండవుల గుళ్లుగా పిలుస్తున్న స్థానిక ప్రజలు

  • బండలపై ఆ కాలం నాటి అపురూప రేఖాచిత్రాలు

  • పట్టించుకునేవాళ్లులేక ఛిద్రమవుతున్న చారిత్రక సంపద

  • ప్రభుత్వం చొరవ చూపితే పర్యాటక కేంద్రంగా మారే అవకాశం

(రాయచోటి-ఆంధ్రజ్యోతి): చుట్టూ దట్టమైన అడవి. ఆ అడవి మధ్య పద్ధతి ప్రకారం అమర్చిన రాళ్లు. నాలుగు రాళ్లను నిలిపి.. వాటిపైన మూతగా ఓ పెద్ద బండ. అలా పెట్టిన కొన్ని రాళ్ల చుట్టూ.. తామరపూల ఆకారంలో నిలువుగా అమర్చిన బండరాళ్లు, అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండలం రాయవరం గ్రామం దేవవాండ్లపల్లె సమీపంలోని ఎర్రకొండల్లో ఇటువంటి నిర్మాణాలు. న్నాయి. ఆ బండరాళ్ల వెనుక మూడువేల సంవత్సరాలకు పూర్వం మనుషుల జీవన విధానాన్ని తెలిపే చరిత్ర ఉంది. ఆదిమ మానవుడు రాతియుగం నుంచి అభివృద్ధి చెందుతూ.. ఇనుమును వినియోగించిన కాలం (బృహత్ శిలాయుగం) నాటి చరిత్ర అది. అప్పట్లోనే ఇక్కడ జీవించిన మానవులు తమ సమాధులను ఎలా నిర్మించారో నేటి తరానికి తెలియ జేసే ఆనవాళ్లే ఆ పెద్దపెద్ద రాతి నిర్మాణాలు. ప్రస్తుతం వీటి ఆలనాపాలనా చూసేవారు లేక.. ప్రభుత్వాలు పట్టించుకోక... గుప్తనిధులు ఉంటాయేమోననే కొందరి దురాశ కారణంగా.. ఆ నిర్మాణాలు ధ్వంసమై శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.


నాలుగు ఎకరాల్లో.. 50 నిర్మాణాలు

అన్నమయ్య జిల్లాకు ఎంతో ప్రాచీన చరిత్ర, సంస్కృతి ఉన్నాయనడానికి ఈ రాతి నిర్మాణాలే నిదర్శనం. దేవవాండ్లప ల్లెకు ఉత్తర దిశలో దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోని శేషాచల కొండల్లోని ఎర్రకొండల్లో ఈ నిర్మాణాలు ఉన్నాయి. పురావస్తు పరిశోధకుల ప్రకారం.. ఇక్కడి రాతి నిర్మాణాలు మూడు వేల ఏళ్ల క్రితం బృహత్ శిలాయుగంలో మరణించిన మనుషుల సమాధులు. అవి నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం అన్నీకలిపి 50 వరకు ఉన్నాయి. పూర్వ కాలంలో ఎవరైనా మరణిస్తే.. ప్రత్యేక పద్ధతిలో పెద్ద పెద్ద బండరాళ్లను ఉపయోగించి సమాధులు నిర్మించే వారు. సాధారణంగా సమాధుల్లో డాల్మెన్స్, స్టోన్ సర్కిల్స్, మెనార్స్, సిస్ట్బరియల్స్, డాల్మెనాయిడ్ సిస్ట్స్ అనే రకాలు ఉంటాయి. దేవవాం డ్లపల్లెలోని సమాధులు.. డాల్మెన్స్ రకానికి చెందినవి. వీటి నిర్మాణానికి ఆర్కియన్ యుగపు గ్రానైట్: రాయిని ఉపయోగించారు. ఈ సమాధుల్లో మృతదేహంతో పాటు.. ఇనుప పరికరాలు, మట్టి పాత్రలు వేసి పూడ్చేవారు. సమాధులు లోపలి బండలపై ఆనాటి కాలంలో చిత్రించిన తెలుపు రంగులో ఏనుగు, ఏనుగుపై సవారీ చేస్తున్న మనిషి తాబేళ్లు, డైనోసార్స్ను పోలిన రేఖాచిత్రాలు ఉన్నాయి. సమాధుల వద్దకు అడవి జంతువులు వెళ్లడానికి వీలు లేకుండా వాటి చుట్టూ తామరపూవు ఆకారంలో 10 నుంచి 15 అడుగుల ఎత్తు ఉన్న పెద్దపెద్ద బండరాళ్లు నిలబెట్టారు. ఈ నిర్మాణాలకు సమీపంలోనే ఉన్న మరో గుట్ట పైన శ్లాబ్స్ ఉన్న డాల్మెన్స్ ఉన్నాయి.


పర్యాటక కేంద్రంగా అభివృద్ధి

వేల సంవత్సరాల నాటి ఈ బృహత్ శిలాయుగపు సమాధులు ఉన్న ప్రాంతాన్ని ఇప్పటికైనా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం ఇవి. ఉన్నచోటుకు చేరుకోవాలంటే అడవిలో చాలా దూరం నడవాల్సి ఉంటుంది. అయితే ఈ సమాధులకు ఉన్న చరిత్ర, ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే. పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చి చారిత్రక విశేషాలను తెలుసుకునే అవకాశం ఉంది. ఈ రాతి సమాధులు ఉన్న ప్రాంతం చుట్టూ కంచె ఏర్పాటు చేసి వాటిని పై భవిష్యత్తు తరాలకు భద్రంగా అందించే అవకాశం ఉంటుంది.

1914లో వెలుగులోకి..

ఈ సమాధులను మొట్టమొదట 1914లో గుర్తించారు. అప్పటి బ్రిటిష్ పాలనలో రాబర్ట్ బ్రూస్ అనే ఆంగ్లేయుడు వీటిని మొదటిసారిగా గుర్తించాడు. ఈ మేరకు 'ది ఫూటే కలెక్షన్ ఆఫ్ ఇండియన్ ప్రి-హిస్టారిక్ అండ్ ప్రోటో-హిస్టారిక్ యాంటిక్విటీస్ కేటలాగ్ రైజాన్ బై మద్రాస్ గవర్నమెంట్ ప్రెస్'లో రికార్డయింది. అనంతరం వీటిని ఎవ్వరూ పట్టించుకోలేదు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం చరిత్రకారులు కొందరు ఇక్కడికి వెళ్లి వీటిని పరిశీలించారు. అయినా ఇవి పెద్దగా వెలుగులోకి రాలేదు.


దక్షిణ భారతదేశంలో ఎక్కువ

ప్రాచీన కాలంలో రాతి సమాధుల సంస్కృతి దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అలాంటి సమాధులు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఈశాన్య భారతంలో కూడా కొన్ని చోట్ల. ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో మాత్రం ఇలాంటి సమాధులు కనిపించవు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా రాయలసీమలోనే ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో ఉన్న వాటిలో దేవవాండ్లపల్లె వద్ద ఉన్నవే పెద్దవి కావడం విశేషం. సుండుపల్లె మండలం మడితాడు గ్రామం పడమర వైపు చెన్నకేశవ స్వామి దేవస్థానం వెనుక వైపు ఉన్న గుట్టల్లోనూ.. ఇటువంటి రాతి సమాధులు సుమారు 20 వరకు ఉన్నాయి. సంబేపల్లె మండలంలోనూ అక్కడక్కడా కనిపిస్తాయి. చిత్తూరు జిల్లాలోనూ.. ఇటువంటివి పలుచోట్ల ఉన్నాయి. దక్షిణ కర్ణాటక మూదిబిదిరి ప్రాంతంలో... అచ్చం దేవవాండ్లపల్లెలో ఉన్నట్లే సమాధుల నిర్మాణాలు ఉన్నాయి. అయితే ఎక్కువగా సమా ధులు ఉన్నది మాత్రం సుండుపల్లె మండలంలో మాత్రమే. అయితే వీటిలో పాండవులు అజ్ఞాతవాస కాలంలో నివసించారని.. కడప, చిత్తూరు జిల్లా ప్రజల విశ్వాసం, దీంతో వీటిని ఈ జిల్లాల్లో పాండవుల గుళ్లుగా పిలుస్తారు. దేవవాండ్లపల్లె ప్రజలు వీటిని పాండురాజు గుళ్లు అంటారు. ఇలాంటి సమాధుల్లో రాక్షసులు నివసించారని భావించే కర్నూలు, ప్రకాశం జిల్లాల ప్రజలు వీటిని రాక్షస గుళ్లు అని పిలుస్తారు.


అపురూపమైన చారిత్రక సంపద

ఈ కట్టడాలు బృహత్ శిలాయుగం. నాటి మానవుల సమాధులు. గతంలో పరిశోధనలు చేసిన వారు ఇవి. దాదాపు 3 వేల ఏళ్లనాటివి అని చెప్పారు. అయితే ఇటీవల హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వారు.. ఇలాంటి సమాధుల్లో దొరికిన వాటిని అధునాతన పద్ధతుల్లో పరిశీలించి ఇవి దాదాపు 4,400 ఏళ్లనాటివని తేల్చారు. ఈ సమాధుల బండలపైన రాళ్లను పిండిచేసి అందులో ఆకుపసరులు కలిపి నాటి మానవులు బొమ్మలు గీశారు. ఇవి సహజమైన రంగులు కావడంతో ఇప్పటికీ చెరిగిపోకుండా ఉన్నాయి. ఇలాంటివి. దక్షిణ భారతదేశంలో.. ముఖ్యంగా రాయలసీమలో ఎక్కువగా ఉన్నాయి. ఈ నిర్మాణాల్లో నిధులేవీ ఉండవు. కొందరు ఈ బండలను పొలాలకు కంచెలకు, ఇళ్లకు వాడుకుంటున్నారు. ఇవి అపురూపమైన చారిత్రక సంపద, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ముఖ్యంగా పురావస్తు శాఖ, రెవెన్యూ వారు వీటిని పరిరక్షించాల్సి ఉంది.

- జూదవ్ విజయకుమార్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్, పురావస్తుశాఖ

Updated Date - Nov 24 , 2024 | 08:55 AM