ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Nimmala: ఏ సీఎం చేయని ద్రోహం జగన్ చేశారు: మంత్రి నిమ్మల

ABN, Publish Date - Dec 22 , 2024 | 01:16 PM

కూటమి ప్రభుత్వం ఎంత ఖర్చయినా గోదావరి - పెన్నా పూర్తి చేసి, రాయలసీమను రతనాల సీమగా మార్చుతామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాయలసీమ బిడ్డ అని చెప్పు కుంటూనే, గతంలో ఏ ముఖ్య మంత్రి చేయని ద్రోహం జగన్ మోహన్ రెడ్డి చేశారని మంత్రి విమర్శించారు.

కడప జిల్లా: ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఆదివారం గండికోట రిజర్వాయర్‌ (Gandikota Reservoir)ను పరిశీలించారు. గత ఐదుసంవత్సరాల వైఎస్ఆర్‌సీపీ (YSRCP) పాలనలో ఎక్కువ విధ్వంసానికి ఇరిగేషన్ శాఖే (Irrigation Department) గురైందని.. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ బిడ్డ అని చెప్పు కుంటూనే, గతంలో ఏ ముఖ్య మంత్రి చేయని ద్రోహం జగన్ మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) చేశారని విమర్శించారు. 2014-19లో నాటి టీడీపీ పాలనలో రాయలసీమ ప్రాజెక్టులకు రూ. 12,400 కోట్లు కేటాయించామని, 2019-24 ఐదేళ్ల పాలనలో జగన్ రాయలసీమ ప్రాజెక్టులకు రూ. 2 వేల కోట్లు మాత్రమే కేటాయుంచారని ఆరోపించారు. రాయలసీమకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు హంద్రీనివాకు ఎక్కువ నిధులు కేటాయించి, ప్రాజెక్టు పనులు తిరిగిప్రారంభిస్తున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. ప్రతి వ్యక్తికి తాగు నీరందించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఉన్నారన్నారు. గత టీడీపీ పాలనలోనే గండి కోట రిజర్వాయర్ నిర్వాసితులకు 95 శాతం పరిహారం చెల్లించామని చెప్పారు.


గోదావరి - పెన్నా ప్రాజెక్ట్ గేమ్ చేంజర్..

కూటమి ప్రభుత్వం ఎంత ఖర్చయినా గోదావరి - పెన్నా పూర్తి చేసి, రాయలసీమను రతనాల సీమగా మార్చుతామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం..

కాగా దేశ రాజధాని ఢిల్లీలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ లోని తెలుగు ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సభ్యత్వకార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. టుగెదర్ ప్రోగ్రెస్ , టుగెదర్ విత్ టీడీపీ పేరుతో సభ్యత్వ నమోదు కార్యక్రమం సాగుతోంది. సదరన్ ట్రావెల్స్ అధినేత ఆలపాటి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా టీడీపీ పార్లమెంటరీ సెక్రటరీ సత్యనారాయణ హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతిపై మళ్లీ కుట్రలు..

చెప్పులు కుట్టే వ్యక్తిని సన్మానించిన పవన్

ప్రమాదం ఆయన ప్రేరేపించింది కాదు: పురందేశ్వరి

కుప్పంలో నాల్గవ రోజు నారా భువనేశ్వరి పర్యటన

కాలినడకన ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భవానీలు...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 22 , 2024 | 01:16 PM