MP Avinash: నెక్ట్స్ టార్గెట్ ఎంపీ అవినాష్.. ఎన్నికల్లోపే అరెస్ట్..?
ABN, Publish Date - Mar 16 , 2024 | 01:45 PM
ఏపీలో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఐదేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ ఏ-8గా చేర్చింది. దీంతో ఆయన బెయిల్‌పై బయట తిరుగుతున్నారు.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) అరెస్టు (Arrest) ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ (PM Modi) రోడ్ షో (Road Show) జరుగుతున్న సమయంలోనే ఈడీ (ED) అధికారులు కవితను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. ఓ వైపు సుప్రీం కోర్టు (Supreme Court)లో విచారణ జరుగుతున్న సమయంలో కవిత ఇంటికి వచ్చిన అధికారులు సోదాలు నిర్వహించి తర్వాత ఆమెను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ (Election Schedule)కు ఒక రోజు ముందే కవిత అరెస్టు అయ్యారు. తర్వాత ఏపీ (AP)లో ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) అరెస్టు ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు (Viveka Murder Case) విచారణ ఐదేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ (CBI) ఏ-8గా చేర్చింది. దీంతో ఆయన బెయిల్‌పై బయట తిరుగుతున్నారు. అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీత (Sunitha) ఇప్పటికే న్యాయపోరాటం చేస్తున్నారు. దీంతో ఏపీలో ఎన్నికలు పూర్తి అయ్యేలోపే అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి రద్దు చేయాలని కోరుతూ అఫ్రూవర్‌గా మారిన దస్తగిరి (Dastagiri) వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) అనుమతించింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం అవినాష్ రెడ్డికి వ్యక్తిగతంగా నోటీస్ (Notice) ఇచ్చింది.
Updated Date - Mar 16 , 2024 | 01:47 PM