Prashant Kishore: జగన్ ఓటమి తధ్యం.. మరోమారు స్పష్టం చేసిన పీకే
ABN, Publish Date - May 20 , 2024 | 07:25 AM
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓటమి తథ్యమని మరోమారు స్పష్టం చేశారు. వైయస్ జగన్ ప్రభుత్వానికి ఈ ఎన్నికలతో నూకలు చెల్లిపోతాయని చెప్పేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అధికార వైసీపీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయి.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై (Elections 2024 Result) రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ( Prashant Kishore) సంచలన వ్యాఖ్యలు (Sensational comments) చేశారు. జగన్ (Jagan) ఓటమి తథ్యమని మరోమారు స్పష్టం చేశారు. వైయస్ జగన్ ప్రభుత్వానికి ఈ ఎన్నికలతో నూకలు చెల్లిపోతాయని చెప్పేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అధికార వైసీపీ శ్రేణుల్లో (YCP Activists) గుబులు రేపుతున్నాయి. తెలుగుదేశం అధినేత (TDP Chief) చంద్రబాబు (Chandrababu) సీఎం కావడం ఖాయమని అన్నారు. జగన్ తనకు 151 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని అనుకోవడం భ్రమని.. తాను చెప్పింది కరెక్ట్ అయితే జగన్ మొహంపై పేడ పడుతుందని, ఆయన గెలవడం దుర్లభం అని పీకే స్పష్టం చేశారు.
కాగా 2019 ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. దీంతో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ అధికార పీఠాన్ని అదిష్టించారు. అయితే ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్.. అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధిలో సైతం అగ్రస్థానంలో ఉండాల్సిన రాష్ట్రం.. అధోగతికి చేరింది. ఇంకా చెప్పాలంటే.. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు లేవు.. సరికదా ఉన్న పరిశ్రమలు సైతం ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి.
దీంతో ఉద్యోగం, ఉపాధి లేక యువత ఇతర రాష్ట్రాలకు పయనమైంది. ఇక నవరత్నాలు పేరిట ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. లబ్దిదారుల ఖాతాల్లో జగన్ ప్రభుత్వం నగదు వేస్తుంది. అవి కూడా అడపాదడపా ఆగిపోతున్నాయి. ఇక రాష్ట్రంలో ఖజానా పూర్తిగా నిండుకొంది. దీంతో అప్పుల కోసం ప్రతి నెల కేంద్రం ముందు జగన్ సర్కార్ చెయ్యి చాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. రాష్ట్రంలోని నెలకొన్న తాజా పరిస్థితులపై ప్రజలకు ఓ స్పష్టమైన అవగాహన వచ్చింది. ఆ క్రమంలో ఈ ఎన్నికల్లో ఓ స్పష్టమైన తీర్పు ఇచ్చేందుకు ఓటర్లు.. తమ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ ఓటమి తధ్యం.. మరోమారు స్పష్టం చేసిన పీకే
సంచలన హామీ ఇచ్చిన ప్రధాని మోదీ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 20 , 2024 | 07:58 AM