ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Road Accident: ఏపీలో వేర్వేరు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు..

ABN, Publish Date - Sep 22 , 2024 | 08:10 AM

అమరావతి: ఆంధ్ర రాష్ట్రంలో వేర్వేరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో మొత్తం ఏడుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయా సంఘటన ప్రదేశాలకు చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra Pradesh)లో వేర్వేరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు (Road Accidents) జరిగాయి. ఈ ఘటనల్లో మొత్తం ఏడుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయా సంఘటన ప్రదేశాలకు చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం, దయ్యకుంటపల్లి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న లారీ, ఇన్నోవా వాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు అనంతపురం నగరానికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం‌ జరిగింది. చిల్లకూరు వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి అతి వేగంగా వచ్చన కారు ఢీ కొంది. ఈ ప్రమాదంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అరుణాచలం దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు నెల్లూరు నగరం వనంతోపుకి చెందిన జగదీశ్ (50), బాబు (45), వెన్నెల (8) గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


కడప జిల్లాలో పోలీసులు దారిదోపిడి ముఠా గుట్టు రట్టు చేశారు. 8 మంది యువకులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒకటిన్నర కేజి గంజాయి, నగదు, సెల్ ఫోన్లు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా హైవే రోడ్లపై లారీలను ఆపి డ్రైవర్లను కత్తులతో బెదిరించి నగదును దోచుకుంటోంది. అలాగే కడప నగరంలోని చిన్నచౌకు పిఎస్ పరిధిలో పేకాటస్ధావరాలపై పో లీసులు దాడులు చేశారు. ఏడుగురిని అరెస్టు చేశారు. ఇంకా రూ. 75,800 నగదు, 4 వాహనాలు, 8 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.

కాగా కడప జిల్లాలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. ఎస్‌బీఐ ఎటిఎం లు ధ్వంసం చేసి వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. కడప నగరంతో పాటు ఒంటిమిట్టలో ఎస్‌బీఐ ఏటీఎంలలో దోపిడీ చేశారు. కడప రైతు బజార్ వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో రూ. ఆరు లక్షలు దోచుకున్నారు. ఎల్ఐసి వద్ద ఉన్న ఏటీఎంలో దొంగతనానికి యత్నించగా పోలీస్ సైరన్ మోగడంతో దొంగలు పరారయ్యారు. ఒంటిమిట్టలోని ఎస్‌బీఐ ఏటీఎంలో రూ. 36 లక్షల వరకు దొంగల ముఠా డోచుకున్నట్లు సమాచారం. వీటన్నింటిపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పవన్ కల్యాణ్11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష..

జగన్‌.. మహా పాతకం!

చరిత్రహీనుల్లా మిగిలిపోయేలా శిక్షిస్తాం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 22 , 2024 | 08:10 AM