ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kadapa: ఇరువర్గాల మధ్య కొనసాగుతున్న వార్.. పోలీసుల మోహరింపు..

ABN, Publish Date - Dec 03 , 2024 | 11:32 AM

ఆర్టీపీపీ దగ్గర మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జేసీ లారీలకు ఫ్లైయాస్‌ను లోడ్ చేయకుండా జమ్మలమడుగు నేతలు అడ్డుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో లారీలు, టిప్పర్లను జేసీ వర్గీయులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఆదిపత్యపోరు నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. రెండు జిల్లాల నేతలు పట్టువదలడంలేదు. సీఎం చంద్రబాబు పంచాయతీ చేసినా కూడా వారు పట్టించుకోవడంలేదు.

కడప జిల్లా: ఆర్టీపీపీ (RTPP) ఫ్లైయాష్ (Playash) బూడిద కోసం ఏపీ నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. బూడిద కోసం రెండు జిల్లాల కూటమి నేతలు పట్టు వదలడంలేదు. సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) మాటలు కూడా కూటమి నేతలు లెక్క చేయడంలేదు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, (MLA Adinarayana Reddy) టీడీపీ ఇన్చార్జ్ భూపేష్ రెడ్డి, (Bhupesh Reddy) తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతోంది.


ఆర్టీపీపీ దగ్గర మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జేసీ లారీలకు ఫ్లైయాస్‌ను లోడ్ చేయకుండా జమ్మలమడుగు నేతలు అడ్డుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో లారీలు, టిప్పర్లను జేసీ వర్గీయులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఆదిపత్యపోరు నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. రెండు జిల్లాల నేతలు పట్టువదలడంలేదు. సీఎం చంద్రబాబు పంచాయతీ చేసినా కూడా వారు పట్టించుకోవడంలేదు. మళ్లీ యధాతథంగా ఎక్కడి వాహనాలు అక్కడ అడ్డుకోవడం జరిగింది.

ఇసుక కోసం జమ్మలమడుకు చెందిన లారీలు, టిప్పర్లు రాత్రి తాడిపత్రి వెళితే జేసీ వర్గీయులు అడ్డుకున్నారు. అలాగే ఫ్లైయాష్ బూడిద కోసం జేసీ వర్గానికి చెందిన లారీలు, టిప్పర్లను జమ్మలమడుగు వద్ద ఆదినారాయణ రెడ్డి వర్గీయలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. కాగా నిన్న (సోమవారం) ఇరు వర్గాల నేతలను సీఎం చంద్రబాబు పిలిపించారు. అయితే జ్వరం వచ్చిందని జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లలేదు. ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి వెళ్లారు. ఆ ఇద్దరికి చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. అయినా మంగళవారం మళ్లీ యధాతథంగా ఇరు వర్గాల మద్య ఉద్రిక్తత నెలకొంది. దీనిపై ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


కాగా జమ్మలమడుగులో నియోజక వర్గ పరిధిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆర్టీపీపీ నుంచి ఫ్లైయాస్ పౌడర్ (Flyash powder) తాడిపత్రికి (Tadipatri) తరలించే విషయంలో జేసీ బ్రదర్స్ (JC Bros.,).. (vs) ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి (MLA Adinayana Reddy) వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. మూడు రోజులుగా ఇరు వర్గల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. అటు తాడిపత్రి నుంచి జేసీ వర్గీయులు మళ్లీ వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలు మొహరించాయి. అనంత పురం, కడప జిల్లా బోర్డర్ అయిన కొండాపురం మండలంలో చెక్ ఫోస్ట్ ఏర్పాటు చేశారు. ఆర్టీపీపీ నుండి ప్లయాస్ పౌడర్‌ను తాడిపత్రికి తరలించే విషయంలో జేసీ బ్రదర్స్ ఆదినారాయణ వర్గాల మధ్య వివాదం నడుస్తోంది.

కాగా జేసీ దివాక‌ర్‌రెడ్డి, ఆదినారాయ‌ణ‌రెడ్డి.. ఇద్దరూ కూట‌మి నేతలే కావ‌డం విశేషం. జేసీ దివాక‌ర్‌రెడ్డి తాడిప‌త్రికి చెందిన టీడీపీ నాయ‌కుడు, ఆదినారాయ‌ణ‌రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే. వీళ్లిద్దరి మ‌ధ్య ప్లైయాష్ త‌ర‌లింపున‌కు సంబంధించిన ఒప్పందంపై విభేదాలు తలెత్తాయి. జ‌మ్మల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోకి ఆర్టీపీపీ వ‌స్తుంది. దీంతో త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రిగినా త‌మ క‌నుస‌న్నల్లోనే జరగాలని ఆదినారాయ‌ణ‌రెడ్డి భావిస్తున్నారు. అయితే తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలోని సిమెంట్ ప‌రిశ్రమ‌ల‌కు ఆర్టీపీపీ నుంచి జేసీ దివాక‌ర్‌రెడ్డి వ‌ర్గీయుల వాహ‌నాలు ప్లైయాష్ త‌ర‌లిస్తున్నాయి. దీనిపై ఒప్పందం కుద‌ర‌క‌పోవ‌డంతో జేసీ దివాక‌ర్‌రెడ్డి వాహ‌నాల్ని ఆర్టీపీపీకి ఎట్టి ప‌రిస్థితుల్లో రానివ్వకూడ‌ద‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి వ‌ర్గీయులు పంతం ప‌ట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు..

చిన్న వెంకన్న ఆలయంపై డ్రోన్ కలకలం..

వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మె ల్యే ద్వారంపూడికి మరో షాక్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 03 , 2024 | 11:34 AM